బాలకృష్ణ కథానాయకుడిగా
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రమేష్
పుప్పాల 'సామాన్యుడు' ఫేం రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం
'శ్రీమన్నారాయణ'. బాలయ్య సరసన పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లగా నటిస్తున్నారు.
తాజాగా
ఈ సినిమా స్టోరీ లైన్ లీకైనట్లు తెలుస్తోంది.
ఆ వివరాల ప్రకారం కథలోకి వెళితే....ఈ చిత్రంలో రంగనాథ్
బాలకృష్ణ తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఒక
విలేజ్కి పెద్ద మనిషి,
మంచి మనసున్న వ్యక్తి. గ్రామాభివృద్ధి కోసం కోట్లాది రూపాయల
నిధులు సేకరిస్తారు. అయితే విలన్స్(జయప్రకాష్
నారాయణ తదితరులు) అతన్ని చంపి ఆ డబ్బు
తీసుకుంటారు. అయితే ఈ వ్యవహారంలో
బాలయ్య అరెస్టవుతారు. మరి జైలు నుంచి
వచ్చిన బాలయ్య వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు?
తన తండ్రి కలలను ఎలా సాకారం
చేశాడు? అనేది క్లైమాక్స్.
ఈ చిత్రం బాలకృష్ణ చేస్తున్న ఎడ్వంచరస్ థ్రిల్లర్గా యూనిట్ సభ్యులు
చెబుతున్నారు. బాలకృష్ణ స్టైల్లో వుంటూనే అటు
క్లాస్ని, ఇటు మాస్ని అన్నివర్గాల వారినీ
ఆకట్టుకునే రీతిలో 'శ్రీమన్నారాయణ' రూపొందుతోంది. ఆరుగురు విలన్స్కీ, బాలయ్యబాబుకీ మధ్య
జరిగే టగ్ ఆఫ్ వార్
చాలా ఆసక్తిరకంగా వుంటుందట.
బాలకృష్ణ,
పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్కుమార్, సురేష్,
వినోద్కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతిప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ,
రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు,
సుప్రీత్, సుధ, సత్యకృష్ణ, మాటలు:
పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫి: టి.సురేందర్రెడ్డి,
సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్.సురేష్కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్వర్మ, కాస్ట్యూమ్స్:
ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్:
కమల్మోహన్రావు, రామ్మోహన్,
నిర్మాత: రమేష్ పుప్పాల, కథ-కథనం-దర్శకత్వం:
రవికుమార్ చావలి.
0 comments:
Post a Comment