హైదరాబాద్:
డిజిపి దినేష్ రెడ్డి నియామకాన్ని కొట్టి వేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడంపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి గౌతమ్
కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం
చేశారు. అన్నీ అక్రమ నియామకాలే
అని ఆరోపిస్తూ ఆయన స్వచ్ఛంద పదవి
విరమణకు దరఖాస్తు చేశారు. తన నిర్ణయానికి కారణాలను
పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన మంగళవారం లేఖ
రాశారు.
డిజిపిల
నియామకానికి సం బంధించి రాష్ట్ర
ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని ఆయన తన 20 పేజీల
సుదీర్ఘ లేఖలో తూర్పారబట్టా రు.
డిజిపిలుగా ఎస్ఎస్‌పి యాదవ్, గిరీష్
కుమార్, అరవింద రావు, దినేష్ రెడ్డిలను
నియమించడాన్ని న్యా యస్థానాలు తప్పుబట్టినప్పటికీ..
చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే
పలు ఆదేశాలను తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఎస్‌పి యాదవ్‌ను
తొలగించి గిరీష్ కుమార్‌ను డిజిపిగా నియమించాలని
ప్రభుత్వం భావించినప్పుడు ఆయన కనీసం డిజిపిగా
పదోన్నతి పొందలేదని, అప్పటికప్పుడు ఆ హోదాను కల్పించారని
ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని హైకోర్టు ప్రస్తావించడాన్ని లేఖలో పేర్కొన్నారు. గిరీష్
కుమార్, అరవింద రావుకు పదోన్నతుల విషయంలో ప్రధాన కార్యదర్శి గుడ్డిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించారని, ఈ విషయంలో ఎలాంటి
న్యాయ సలహా కోరకపోవడం విచిత్రమని
గౌతమ్ కుమార్ అభిప్రాయపడ్డారు. డిజిపి నియామకాలపై పలు సందర్భాల్లో క్యాట్
ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు
చేయలేదని మండిపడ్డారు.
స్క్రీనింగ్
కమిటీ ప్యానెల్‌ను ఎంపిక చేసి
నివేదించడానికంటే ముందే దినేశ్ రెడ్డిని
డిజిపిగా నియమిస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారని పేర్కొ
న్నారు. ఉన్నతస్థాయి వ్యక్తులు అలా వ్యవహరించడం నమ్మశక్యంగా
లేదని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనే అద్దం
పడుతోందన్నారు. డిజిపి నియామకం చెల్లదన్న క్యాట్ తాజా ఆదేశాలను కూడా
ప్రభుత్వం పెడచెవినపెడుతోందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి వల్ల పోలీసు
శాఖ మొత్తం నైతికంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా
ఇటీవల డిజిపి దినేష్ రెడ్డి నియామకాన్ని క్యాట్ తప్పు పట్టిన విషయం
తెలిసిందే. వెంటనే పునర్నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన
మంగళవారం హైకోర్టులో అప్పీలు చేశారు. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ సోమవారం ప్రభుత్వం అప్పీలు చేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు పిటిషన్లు బుధవారం
విచారణకు వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment