హైదరాబాద్:
తనయుడు నారా లోకేష్ కుమార్
రాజకీయ ఆరంగేట్రంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఏమీ మాట్లాడకుండా మౌనంగా విన్నారని సమాచారం. ఉప ఎన్నికలలో ఓటమిపై
రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల సమీక్షలు ఎన్టీఆర్ భవనంలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు
నాయకులు లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై అధినేతకు సూచించినట్లుగా సమాచారం.
లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు
రావాలని వారు బాబును కోరారు.
పార్టీ సుప్రీంగా చంద్రబాబు ఉంటూనే.. యువతకు ప్రాధాన్యతనిచ్చే విధంగా కుమారుడిని కూడా పార్టీలోకి తేవాలని
సూచించారు. అన్ని విషయాలు మీ
వరకు తీసుకు రాలేమని, కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఒక నేత కావాలని,
ఇప్పుడు పలువురు నేతలు ఉన్నప్పటికీ, యువతను
ప్రోత్సహించే క్రమంలో లోకేష్‌ను తీసుకు రావాలని
సూచించారని సమాచారం.
వారి
మాటలు బాబు మౌనంగా విన్నట్లు
సమాచారం. గతంలో లోకేష్ ప్రస్తావన
తీసుకు వస్తే అతను వ్యాపారంలో
బిజీగా ఉన్నాడని, రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రస్తావన లేదని చెప్పేవారు. ఇప్పుడు
మాత్రం తనయుడి రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఎవరైనా ప్రస్తావిస్తే దానిని ఖండించకుండా మౌనంగా వింటున్నారట.
దీంతో
మొత్తానికి లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు
వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని అర్థమవుతోందని అంటున్నారు. ఇది వరకు ఖండించడం
ఇప్పుడు మౌనంగా ఉండటం చూస్తుంటే త్వరలో
గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని
అంటున్నారు. అయితే ఈ విషయంలో
బాబుదే తుది నిర్ణయమని చెబుతున్నారు.
0 comments:
Post a Comment