డబ్బును
మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయాలంటే మన
వద్ద దాచుకోలేనంత ధనం ఉండాలి. అప్పుడు
తిమ్మిని బమ్మి చేయొచ్చు, కొండ
మీద కోతిని పట్టుకోవటానికి కోట్ల రూపాయాల హెలికాఫ్టర్లను
వాడొచ్చు. సరే ఈ విషయం
అటుంచి, క్రింద ఫోటోలో కనిపిస్తున్న కారు (ఫోటో చూడగానే
మీకు అర్థమైపోయింటుంది, ఇదే బంగారంతో చేసిన
కారని) దగ్గరకు వస్తే.. ఇది ప్రపంచంలోనే అత్యంత
వేగంతో పరుగులు పెట్టే సూపర్ కార్లను తయారు
చేసే లాంబోర్గినీ అందిస్తున్న అవెంటేడర్ ఎల్పి700-4.
మియామీకు
చెందిన లాంబోర్గినీ సీఈఓ ఈ కారును
గోల్డ్ ప్లేటెడ్తో స్పెషల్గా
తయారు చేయించుకున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి
గోల్డ్ ప్లేటెడ్ లాంబోర్గినీ కారు కావటం విశేషం.
లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్పి700-4 సూపర్
కారు సుమారు 700 గుర్రాల శక్తితో సమానం. ఇది గరిష్టం గంటకు
350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్పిఐ
పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్పిల శక్తిని, 690 ఎన్ఎమ్ల టార్క్ను
ఉత్పత్తి చేస్తుంది.
లాంబోర్గినీ
అవెంటేడర్ ఎల్పి700-4 కేలం
2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని
పుంజుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు
గానూ ఈ కారు బాడీని
ముందు, వెనుక వైపు అల్యూమినియం
ఫ్రేమ్తో కూడిన కార్బన్
ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు. ఫోర్-వీల్ డ్రైవ్
ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్పి700-4 సెవన్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్తో లభిస్తుంది.
రెండు
డోర్లు మాత్రమే కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్పి700-4లో
ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది
సిజర్ డోర్స్ను (కత్తెర మాదిరిగా
పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. ఇందులో
ఏబిఎస్, ఈఎస్పి, ఎయిర్
బ్యాగ్స్ వంటి అత్యాధునిక భద్రతా
ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది
లీటర్ పెట్రోల్కు కేవలం మూడు
నుంచి నాలుగు కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది.
0 comments:
Post a Comment