హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కలవడానికి జైలు అధికారులు నిరాకరించడంతో
చంచల్‌గుడా జైలు వద్ద
మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తీవ్ర నిరసన వ్యక్తం
చేశారు. ఇది వరకు రెండుసార్లు
వైయస్ వివేకానంద రెడ్డి ఇదే పనిచేశారు. ఇప్పుడు
రెహ్మాన్ వంతు వచ్చింది. మైనారిటీ
నాయకుడిని అయిన తనకు జగన్‌ను కలుసుకోవడానికి అనుమతి
నిరాకరించడం సరి కాదని రెహ్మాన్
అన్నారు. తాను శుక్రవారం తిరిగి
వస్తానని, అప్పుడు కూడా నిరాకరిస్తే తాను
ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి చెందిన మరో నాయకుడు బాజిరెడ్డి
గోవర్ధన్ కూడా వైయస్ జగన్‌ను కలవడానికి జైలుకు
వచ్చారు. ఆయనను పాలనాభవనం సముదాయంలోకి
పిలిచి, జగన్‌ను కలవడానికి
వీలు లేదని అధికారులు చెప్పారు.
బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు మరో
నాయకుడు జనక్ ప్రసాద్ జైలుకు
వచ్చారు. జగన్‌ను కలుసుకోవడానికి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి
వస్తున్నారు. చంచల్‌గుడా జైలులోకి
వెళ్లి ఆయనతో మాట్లాడవచ్చుననే ఉద్దేశంతో
వారు వస్తున్నారు. కానీ జైలు నిబంధనలు
వారికి అడ్డం వస్తున్నాయి.
వైయస్
జగన్‌ను కలుసుకోవడానికి దాదాపు
300 మంది అభిమానులు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వచ్చారని, అయితే
వారిని పోలీసులు హైదరాబాదులోని బహదూర్‌పురా వద్ద నిలిపేశారని
బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. జైలు నిబంధనల ప్రకారం
సందర్శకుల వివరాలను రిజిష్టర్ చేసి, వారికి టోకెన్
నెంబర్ ఇస్తారు. జగన్ మద్దతుదారులు తమ
పేర్లను రాస్తున్నారు. వెంటనే తమను లోపలికి అనుమతిస్తారని
భావిస్తున్నారు. కానీ అలా జరగడం
లేదు.
ఇటీవల
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన
తండ్రితో వచ్చి చంచల్‌గుడా
జైలులోని ప్రధాన ద్వారం వరకు వెళ్లాడు. అతన్ని
పోలీసులు బయటకు పంపించేశారు. నేరుగా
వెళ్లిపోయి జగన్‌ను కలుసుకోవచ్చనే
భావనతోనే చాలా మంది అలా
చేస్తున్నారు.
0 comments:
Post a Comment