హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై
తీవ్ర వ్యాఖ్యలు చేసిన గుడివాడ శానససభ్యుడు
కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్క్రిప్టు
రాసిస్తే కొడాలి నాని చదివాడని తెలుగుదేశం
పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. కొడాలి నాని వ్యాఖ్యలు దిగజారుడుతనానికి
నిదర్శనమని ఆయన అన్నారు. కొడాలి
నానికి మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు.
నాని పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని ఆయన విరుచుకుపడ్డారు.
చంద్రబాబును
తిట్టే స్థాయి నానికి లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి దేవుడు అని ఆ రోజే
చెప్పాల్సిందని ఆయన అన్నారు. రాజకీయ
భిక్ష పెట్టిన చంద్రబాబుపై నాని అభాండాలు వేయడం
సరి కాదని ఆయన అన్నారు.
కొడాలి నానివి చిలుకపలుకలని ఆయన అన్నారు. స్వార్థంతోనే
నాని పార్టీ మారుతున్నారని ఆయన అన్నారు. ఎన్టీ
రామారావు మరణించడానికి ముందు నాని ఎక్కడున్నారని
పార్టీ మరో నాయకుడు గద్దె
రామ్మోహన్ రావు అడిగారు. తనలాంటి
వాళ్లు అంటే ఏమైనా అర్థం
ఉంటుందని, కాంగ్రెసుకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.
లోకేష్
రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు ఇప్పటి వరకు ఆలోచించలేదని ఆయన
స్పష్టం చేశారు. అయోమయంలో నాని ఏదేదో మాట్లాడేస్తున్నారని
ఆయన అన్నారు. చంద్రబాబును తిట్టే నైతిక హక్కు కొడాలి
నానికి లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు
కుమారుడు నారా లోకేష్‌పై
మాట్లాడే అర్హత కొడాలి నానికి
లేదని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. చంద్రబాబును
తిట్టినంత మాత్రాన కొడాలి నాని పెద్దవాడై పోడని
ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని, గుడివాడ ప్రజలను అవమానించే విధంగా నాని వ్యాఖ్యలు ఉన్నాయని
ఆయన అన్నారు. నాని తీరును ఖండిస్తున్నట్లు
ఆయన చెప్పారు. నాని తీరును ప్రజల్లోకి
తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. వైయస్
జగన్‌ను నాలుగైదు సార్లు
కలవడం రాజకీయ వ్యభిచారం కాదా అని ఆయన
అడిగారు.
కొడాలి
నాని వైయస్ జగన్ పార్టీ
కార్యకర్తలాగే మాట్లాడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
వైయస్ జగన్ అవినీతిపై తమ
పార్టీ పోరాటం చేస్తున్న సమయంలో కొడాలి నాని ఆయనను కలవడం
క్రమశిక్షణారాహిత్యమేనని
యనమల అన్నారు. కొడాలి నానిని సస్పెండ్ చేయడం సరైందేనని తెలుగుదేశం
నాయకుడు వర్ల రామయ్య అన్నారు.
చంద్రబాబుకు నాని క్షమాపణ చెప్పాలని
ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ టికెట్లు ఇచ్చి చంద్రబాబు డబ్బులు
తీసుకున్నారని చెబుతున్న నాని ఎంత డబ్బు
ఇచ్చారో చెప్పాలని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment