కర్నూలు/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ విషయంలో
మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డిని
తన అభిప్రాయం మార్చుకోవాలని తాను కోరతానని చిన్న
నీటి పారుదల శాఖ మంత్రి టిజి
వెంకటేష్ బుధవారం కర్నూలు జిల్లాలో అన్నారు. రాయలసీమ వెనుకబాటుతనంపై ఇక్కడి నాయకులం పోరాడకుంటే మరింత నష్ట పోతామని
అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయని అన్నారు.
ఆగస్టు
16వ తేదిన రాయలసీమ హక్కుల
ఐక్య వేదిక వార్షికోత్సవం జరుపుతామని
చెప్పారు. ఖచ్చితంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే తాము ప్రత్యేక
రాయలసీమ కోరుతామని, అయితే తమ మొదటి
నినాం మాత్రం సమైక్యాంధ్రనే అని చెప్పారు. మన
రాష్ట్రం నుండి ముగ్గురు బ్యాడ్మింటన్
క్రీడాకారులు ఓలింపిక్స్‌కు ఎంపికవడం గర్వకారణమని
అన్నారు. ప్రతి జిల్లాలో బ్యాడ్మింటన్
కోచ్ ఉండాలన్నారు.
హైదరాబాద్,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలలోని బ్యాడ్మిండన్ అకాడమీలను పునరుద్ధరించాలన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వారు రాష్ట్రపతి
అభ్యర్థి రేసులో ఉన్న యుపిఏ అభ్యర్థి
ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేయాలని గండ్ర
వెంకట రమణా రెడ్డి హైదరాబాదులో
కోరారు. ఓటు వేసే విషయంలో
ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రణబ్‌కే వారి మద్దతు
ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
కాగా
ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు బుధవారం ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని
తాను సోనియాకు చెప్పినట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పానని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం లేదని చెప్పానని,
డిసెంబర్ 9 నాటి ప్రకటన, జగన్
విషయంలో కాంగ్రెసు సరిగా వ్యవహరించలేదని చెప్పానని
చెప్పారు.
విభజనపై
ఏ నిర్ణయం తీసుకున్నా ఆందోళన చెలరేగుతుందని ఆమె దృష్టికి తీసుకు
వెళ్లినట్లు చెప్పారు. ఉప ఎన్నికలలో ఓటమికి
బొత్స, కిరణ్ మాత్రమే బాధ్యులు
కారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహించే సమర్థవంతమైన నేత లేరని, సమష్టిగా
వెళ్లడమే మంచి విరుగుడు అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన సమయం సరికాదని
చెప్పానని తెలిపారు.
0 comments:
Post a Comment