హైదరాబాద్:
మొదట కాంగ్రెసు పార్టీలో ఉండి ఆ తర్వాత
తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన తమ
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే
పార్టీలు మారడంలో తమకు గురువు అని
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని బుధవారం ఎద్దేవా
చేశారు. బాబు పార్టీ మారితే
తప్పు లేదు కానీ ఇతరులు
పార్టీ మారితే వెన్నుపోటా అని ప్రశ్నించారు. అప్పుడు
బాబు ఏం చేశాడో ఇప్పుడు
తాను అదే చేశానని అన్నారు.
తాను టిడిపిలోనే ఉండాలని భావిస్తున్నానని, అయితే వారు మొదట
బహిష్కరణను ఎత్తి వేయాలన్నారు.
తనకు
పార్టీ అధినేత వ్యవహారం పైన అసంతృప్తి ఉందన్నారు.
ఆ విషయాన్ని బాబుకు కూడా చెప్పానని, జిల్లాలోని
ఓ వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తాను
పార్టీ అధ్యక్షుడిని మార్చమని చెప్పడం లేదన్నారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. నారా లోకేష్‌ను
రాజకీయాలలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
తాను
జూనియర్ ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టే
పనులు చేయనని చెప్పారు. జూనియర్ సన్నిహితుడిగా భావించి, ఇబ్బందిగా ఫీల్ అయితే అతనికి
దూరంగా ఉంటానని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు
లేవని జూనియరే చెప్పారని, ఆయన చిన్న పిల్లాడు
అని, రాజకీయానుభవం లేదని తానే చెబుతున్నాడని
అన్నారు. జూనియర్ ఎక్కడున్నా మంచి స్థానంలో ఉండాలని
కోరుకునే వ్యక్తిని అన్నారు.
జగన్
స్క్రిప్ట్ చదువుతున్నారన్న టిడిపి నేతల వ్యాఖ్యలను తాను
పట్టించుకోనని చెప్పారు. జగన్ లక్ష కోట్లు
వారు లెక్కబెట్టారా అని ప్రశ్నించారు. తనను
నియోజకవర్గం నుండి తరిమి కొట్టాలని
బాబు ఎలా అంటారని, మతిభ్రమించి
మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే
ప్రయత్నం జరుగుతోందని, బాబు స్క్రిప్ట్‌తోనే
తనపై విమర్శలు చేస్తున్నారని, తాను పార్టీ వీడలేదని,
గెంటి వేయబడ్డానని అన్నారు.
తనపై
టిడిపి నేతలు చేసిన విమర్శలు
కరెక్ట్ అయితే తాను చేసిన
ఆరోపణలు కూడా కరెక్ట్ అన్నారు.
వ్యూహం ప్రకారమే తనను బయటకు పంపించారని
అనుకుంటున్నానని అన్నారు. పదిహేను రోజుల్లో టిడిపిలోనే మార్పు వచ్చిందన్నారు. టిడిపి వచ్చే ఎన్నికలలో ఎక్కడా
గెలవలేని పరిస్థితి ఉందన్నారు. ఉప ఎన్నికలలో డిపాజిట్
కోల్పోయిందన్నారు. టిక్కెట్ ఇచ్చే ఉద్దేశ్యం లేకనే
తనను బయటకు పంపించారని విమర్శించారు.
తాను
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి
దేవుడు అని ఎప్పుడూ చెప్పలేదని,
ప్రజలలో ఆ అభిప్రాయముందని చెప్పానని
అన్నారు. రాజ్యసభ ఎన్నికలలో టిడిపి డబ్బు సంపాదించిందన్నారు. ఎన్టీఆర్ పేరెత్తే
అర్హత బాబుకు, రాజేంద్ర ప్రసాద్‌కు లేదన్నారు. తాను
ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. ఉప
ఎన్నికలలో టిడిపి భారీగా ఖర్చు పెట్టిందన్నారు. ఎన్టీఆర్
పైన తనకు గౌరవం ఉందన్నారు.
0 comments:
Post a Comment