ఇష్క్
చిత్రం హిట్ తో మంచి
జోరు మీదున్న నితిన్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్
సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ లో వీడు తేడా
చిత్రం చేసిన దర్సకుడు చిన్ని
కృష్ణ ఈ సినిమాని డైరక్ట్
చేయనున్నాడు. నితిన్ కెరీర్ లో మూడో హిందీ
టైటిల్ ఇది. మొదట వినాయిక్
డైరక్షన్ లో దిల్,రెండోది
ఇష్క్,ఇప్పుడు దిల్ వాలా. ఇక
దిల్ వాలా చిత్రాన్ని బెల్లంకొండ
సురేష్ నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో
ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఇక ఇప్పటికే నితిన్ హీరోగా ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై
‘కొరియర్‌బోయ్ కళ్యాణ్'అనే
చిత్రం ప్రారంభమైంది. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గౌతమ్
వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న
ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
తమిళంలో ‘తమిళ సెల్వనుం తనియార
అంజలుం' పేరుతో రూపొందిస్తున్నారు. ముఖ్య పాత్రలో జై,
సంతానం, వి.టి.వి
గణేష్ నటిస్తుండగా మిగతా పాత్రల ఎంపిక
జరగనుంది.
గౌతమ్
వాసుదేవ మీనన్ మాట్లాడుతూ -‘‘భాషలకు
అతీతంగా అందరి అభినందనలు అందుకునే
సినిమా ఇది. ప్రేమ, హాస్యం,
యాక్షన్ అన్నీ ఈ కథలో
ఉంటాయి. గాయకుడు కార్తీక్‌ని సంగీత దర్శకుడిగా
పరిచయం చేస్తున్నాం. జై సంతానం, నిటివి
గణేశ్ కీలక పాత్రలు పోషిస్తారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్
షూటింగ్ మొదలవుతుంది'' అని తెలిపారు. త్వరలో
రెగ్యులర్ షూటింగ్‌కి త్వరలోనే వెళ్లనున్న
ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నిర్మాత: గౌతమ్‌వాసుదేవ మీనన్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.
0 comments:
Post a Comment