హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురయింది. ఆయన పెట్టుకున్న బెయిల్
పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
బెయిల్ నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. జగన్‌కు బెయిల్
ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయగలరన్న సిబిఐ వాదనతో ఏకీభవించిన
కోర్టు, దర్యాఫ్తు సంస్థకు సహకరిస్తానన్న జగన్ వాదనను తోసిపుచ్చింది.
జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.
అత్యంత
అనుభవజ్ఞుడైన రాంజెఠ్మలానీ వాదించడం, త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు ఉండటం తదితర అంశాలను
పరిగణలోకి తీసుకొని జగన్‌కు బెయిల్
వస్తుందని జగన్ పార్టీ భావించింది.
కానీ అనూహ్యంగా తీర్పు వ్యతిరేకంగా రావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
కాగా ఇటీవల జగన్ హైకోర్టులో
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే. దానిపై గత వారం గురు,
శుక్రవారాలలో వాదనలు జరిగాయి.
జగన్
తరఫు న్యాయవాది జెఠ్మలానీ వాదిస్తూ.. సిబిఐ విచారణ కోసమని
పిలిచి జగన్‌ను అరెస్టు
చేసిందని, అతని అరెస్టు అక్రమమని
వాదించారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతోందని, జగన్ తన అరెస్టుకు
ముందు సాక్ష్యులను ఎవరినీ ప్రభావితం చేసినట్లుగా ఆధారాలు లేవన్నారు. సమగ్ర విచారణ జరపకుండానే
అరెస్టు చేశారన్నారు. అరెస్టుకు చూపించిన కారణాలు సరిగా లేవన్నారు.
సిబిఐ
కూడా తన వాదనలు వినిపించింది.
జగన్‌కు బెయిల్ ఇస్తే
సాక్ష్యులను తారు మారు చేసే
అవకాశముందని చెప్పారు. కేసు కీలక దశలో
ఉందని, ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని
చెప్పారు. కాగా మరోసారి బెయిల్
కోసం పిటిషన్ దాఖలు చేయాలని జగన్
పార్టీ భావిస్తోంది.
0 comments:
Post a Comment