హైదరాబాద్:
లీడ్ ఇండియా సంస్థ కార్యకర్త, ఐబిఎం
ఉద్యోగిని వాసిరెడ్డి చంద్రబాల ఫోన్ కాల్ లిస్టు
వ్యవహారంలో నమోదైన కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక విలేకరి
యాదగిరి రెడ్డి ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా
కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ కేసులో యాదగిరి
రెడ్డిని ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ
సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన
విషయం తెలిసిందే.
దీంతో
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విలేకరి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ కాల్స్ లీకేజి
వ్యవహారంతో పాటు, ఈ ఘటనపై
సాక్షిలో ప్రసారమైన కథనంతో కూడా తనకు సంబంధం
లేదని, కుట్ర పూరితంగానే తనపై
కేసు మోపారని, ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచిన నేరారోపణలన్నీ
అవాస్తవాలని తన పిటిషన్‌లో
పాత్రికేయుడు పేర్కొన్నారు.
తాను
చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని, నల్గొండ జిల్లా
నార్కట్‌పల్లి నివాసిని అని
వివరిస్తూ... అజ్ఞాతంలోకి వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని విన్నవించాడు. బెయిల్
మంజూరు చేస్తే దర్యాఫ్తు అధికారికి పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. కాగా ముందస్తు బెయిల్
నోటీసు అదనపు పిపి నాగరాజుకు
ఇచ్చారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కేసు తదుపరి
విచారణను ఈ నెల 6కు
వాయిదా వేశారు.
కాగా
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ
కాల్ లిస్ట్ ఇటీవల సంచలనం రేపిన
విషయం తెలిసిందే. సిబిఐ జెడితో చంద్రబాల,
ఇతర మీడియా ప్రతినిధులు మాట్లాడిన కాల్ లిస్టును వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేతలు విడుదల చేశారు.
చంద్రబాలతో ఆంధ్రజ్యోతి ఎండి మాట్లాడారని వారు
ఆరోపించారు. కాల్ లిస్టు పైన
వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment