హైదరాబాద్:
ఆ పార్లమెంటు సభ్యుడిని వదిలిపెట్టేందుకు వర్ధమాన నటి తారా చౌదరి
సిద్దంగా లేనట్లు కనిపిస్తున్నారు. ఆ పార్లమెంటు సభ్యుడిపై
ఆమె మరోసారి ఆరోపణలు చేశారు. ఆయనకు, ఆయన సంబంధీకులకు సంబంధించిన
కాల్ లిస్టును ఆమె విడుదల చేశారు.
ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఓపెన్
హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో
తారా చౌదరి పలువురిపై ఆరోపణలు
చేసిన విషయం తెలిసింది. మరోసారి
మంగళవారం సాయంత్రం ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ తారా
చౌదరితో లైవ్ షో నిర్వహించింది.
ఈ షోలో ఆమె తిరిగి
అవే ఆరోపణలు చేశారు. ఆ ఎంపి వద్దకు
తాను అమ్మాయిలను పంపించానని ఆమె అంగీకరించారు.
తనకు
పరిచయమైనప్పుడు ఆ ఎంపి మసాజ్
కోసం అమ్మాయిలను కావాలన్నాడని, దాంతో తాను కొంత
మందిని పంపించానని ఆమె చెప్పింది. ఓ
ఎమ్మెల్యే పేరును కూడా ఆమె తిరిగి
చెప్పారు. పలువురు పోలీసు అధికారుల పేర్లు కూడా వెల్లడించారు. తన
బలహీనతలను అడ్డం పెట్టుకుని తన
నుంచి ప్రయోజనం పొందారని ఆమె ఆరోపించారు. రాజకీయాల్లో
ప్రవేశపెడతామని, సినిమా అవకాశాలు ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని ఆమె చెప్పారు.
తనంత
తానుగా ఏ తప్పూ చేయలేదని,
తన చేత తప్పులు చేయించారని,
తప్పులు చేయించినవారు బయట ఉన్నారని, ఏ
తప్పూ చేయని తాను ఆరు
నెలల పాటు జైలులో ఉండాల్సి
వచ్చిందని ఆమె అన్నారు. తనను
బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. సినిమా
రంగం తాను ఊహించినంత బాగా
లేదని గుర్తించి ఆ రంగం నుంచి
తప్పుకున్నానని ఆమె చెప్పారు. పార్లమెంటు
సభ్యుడి ఫోన్ నుంచి, ఆయనకు
సంబంధించిన వ్యక్తుల నుంచి 2008 - 2009 మధ్య కాలంలో తనకు
ఫోన్లు వచ్చాయని, తనను బెదిరించారని, తనను
చంపడానికి కూడా ప్రయత్నించారని ఆమె
అన్నారు.
తాను
విడుదల చేసి కాల్ లిస్టు
తప్పని తేలితే తాను ఏ శిక్షకైనా
సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. రేవంత్
రెడ్డి, జోగు రామన్న ఎవరో
తనకు తెలియదని ఆమె చెప్పారు. తనపై
ఆరోపణలు చేసిన అమ్మాయి సరైన
చిరునామా ఇవ్వలేదని, ఆమె పేరు కూడా
తప్పుగా తేలిందని ఆమె అన్నారు. ఆమె
ఎవరో, ఎటువంటి పరిస్థితిలో తనకు తెలుసునని ఆమె
అన్నారు.
0 comments:
Post a Comment