గడచిన
మార్చి నెలలో జెనీవాలో జరిగిన
82వ అంతర్జాతీయ మోటార్ షోలో టాటా ఆవిష్కరించిన
హైబ్రిడ్ కాన్సెప్ట్ కారు 'టాటా మెగాపిక్సెల్'
ప్రస్తుతం బ్రిటన్‌లో కొలువుదీరింది. బ్రిటన్‌లో అంగరంగ వైభవంగా
జరుగుతున్న 'గుడ్‌వుడ్ ఫెస్టివల్
ఆఫ్ స్పీడ్' మోటార్ షోలో టాటా తమ
హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. టాటా మెగాపిక్సెల్ ఇటు
బ్యాటరీ పవర్‌తోనూ అటు
పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.
ఇది లీటరుకు వంద కిలోమీటర్ల (బ్యాటరీ
పవర్‌తో కలిపి) వరకూ
మైలేజీనిస్తుందని టాటా పేర్కొంది.
టాటా
ప్రత్యేకించి మెగాపిక్సెల్‌ను యూరోపియన్ మార్కెట్ల
కోసం డిజైన్ చేసింది. యూరోపియన్ వెర్షన్ టాటా నానో యూరప్
మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి బదులు దానికన్నా మెరుగైన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కారును అక్కడి
మార్కెట్లలో విడుదల చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.
ఈ దిశగా పరిశోధనలు చేసిన
టాటా సాంకేతిక విభాగం తొలుత పిక్సెల్ కాన్సెప్ట్‌ను, అనంత దీని
ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా
చేసుకొని మెగాపిక్సెల్ కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది.
మెగాపిక్సెల్
హైబ్రిడ్ కాన్సెప్ట్ కారులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు (ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క మోటార్) ఉంటాయి. ఇవి 13 కి.వా. లిథియం
అయాన్ ఫాస్పేట్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. బ్యాటరీ పవర్ ద్వారా టాటా
మెగాపిక్సెల్‌పై 54 మైళ్ల దూరం
ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను ఇండక్షన్
ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి రీచార్జ్
చేసుకోవచ్చు.
ఒకవేళ
ఎలక్ట్రిక్ పవర్ (బ్యాటరీ ఛార్జ్)
ఖాలీ అయిపోయినట్లయితే ఇందులో ఉండే చిన్నపాటి 30 బిహెచ్‌పి 325సీసీ సింగిల్
సిలిండర్ పెట్రోల్ ఇంజన్ సాయంతో కారును
నడపొచ్చు. దీని పెట్రోల్ ట్యాంక్‌ను ఒక్కసారి ఫుల్
చేస్తే సుమారు 900 కి.మీ. దూరం
ప్రయాణించవచ్చు.
రేంజ్
ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (రీవ్) కాన్సెప్ట్ ఆధారంగా
చేసుకుని ఈ ఫోర్-సీటర్
సిటీ స్మార్ట్ కారు యూరప్‌లోని
టాటా డిజైన్ విభాగం రూపొందించింది. టాటా మెగాపిక్సెల్ టర్నింగ్
రేడియస్ కేవలం 5.6 మీటర్లు మాత్రమే. ఇది గరిష్టంగా గంటకు
100 కి.మీ. వేగంతో పరుగులు
తీస్తుంది.
0 comments:
Post a Comment