శాకాహారం
తినటం ఎంతో ఆరోగ్యకరం. శాకాహారం
బరువును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు
మీ బరువు ఎంత వుండాలో
అంతే వుండేలా చేస్తుంది. అయితే అది కొన్ని
నిబంధనలకు మాత్రమే. మీరు గనుక శాకాహారం
అంటూ వేపుడు ఆహారాలు తింటే బరువు పెరిగి
తీరతారు. కనుక శాకాహారంలో కూడా
బరువు తగ్గాలనేవారు ఏది తినాలి? ఏది
తినకూడదు అనే దానిపై విచక్షణ
చూపాలి. శాకాహారంలో కూడా అధిక కేలరీలు,
లేదా పిండి పదార్ధాలు అధికంగా
ఉండే ఆహారాలు తినరాదు. అవి మీ బరువును
పెంచుతాయి. కనుక శాకాహారం గురించిన
కొన్ని వాస్తవాలను పరిశీలించండి.
శాకాహారం
పట్ల కొన్ని వాస్తవాలు -
1. పండ్లు,
కూరగాయలు, గింజలు వంటివి మీ ఆహారంలో రెగ్యులర్
గా చేరిస్తే, మీరు ఆరోగ్యకరంగానే కాదు.
సన్నగా, నాజూకుగా కూడా ఉంటారు. అంతేకాదు,
జంతు సంబంధిత రోగాలైన బర్డ్ ఫ్లూ, టేప్
వర్మ్ వంటి వ్యాధులు కూడా
రాకుండా ఉంటాయి.
2. మాంసాహారులకంటే
కూడా శాకాహారులు చాలా సన్నగా వుంటారని
గమనించవచ్చు. అంతమాత్రం చేత శాకాహారం బరువు
తగ్గించేస్తుందని కాదు. అయితే, పచ్చటి
కూరలు, పండ్లు వంటివి తప్పక మిమ్మల్ని స్మార్ట్
గా వుంచుతాయి.
3. పండ్లు,
కూరగాయలలో అధిక నీరు వుంటుంది.
ఇవి మీకు ఎంతో ఆరోగ్యాన్ని
కలిగిస్తాయి. కనుక అవి మీకు
చాలా సేపు కడుపు నిండుగా
వుండేలా అనిపిస్తాయి. ఫలితంగా మీరు తక్కువ తినటానికి
ఇష్టపడతారు. కొద్ది, కొద్దిగా ఆహారం తీసుకోవటం కూడా
డైటింగ్ చేసే వారికి బాగా
పనిచేస్తుంది.
4. మీరు
కనుక బరువు తగ్గటానికి శాకాహారం
ఎంపిక చేసుకుంటే, అది మీకు సంతులిత
ఆహారం అంటే అన్ని పోషకాలు
కల ఆహారంగా వుండాలి. మీరు జంతు సంబంధిత
ఆహారాలు తీసుకోరు కనుక, మీరు తీసుకునే
ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుండాలి. అందుకుగాను, గింజలు, పాలు, ఇతర డైరీ
ఉత్పత్తులు తినండి. మీరు కనుక శాకాహారంలో
ప్రొటీన్లు చేర్చకుంటే, మాంసాహారంలో వుండే ఈ పోషకాలు
మీరు కోల్పోతారు. అపుడు మీకు నష్టం
వాటిల్లి బరువు అతి వేగంగా
కోల్పోతారు. అతి వేగంగా బరువు
తగ్గటం కూడా మీకు నష్టమే.
5. ఒక
ఆహారం మంచిదా కాదా అని నిర్ధారించటానికి
దానిని వండే పద్ధతులు కూడా
పరిగణలోనికి తీసుకోవాలి. ఆహారం వెజిటేరియన్ లేదా
నాన్ వెజిటేరియన్ ఏది అయినప్పటికి, దానిని
బాగా నూనెలలో వేయించడం, తీపి అధికంగా జత
చేయడం లేదా ఉప్పు, మసాలాలు
వేయటం వంటివి మీకు తప్పక బరువు
కలిగించేవిగా ఉంటాయి.
6. జంక్
ఆహారాలు ఎంతో హాని కలిగిస్తాయి.
అవి ఆరోగ్యానికి హాని కలిగించటమే కాదు.
మీ బరువును కూడా పెంచుతాయి. నూనెలలో
బాగా వేయించిన పొటాటో చిప్స్, ఇతర బేకరీ ఆహారాలు
మీకు అధిక కేలరీలనిస్తాయి. మీరు
కనుక శాకాహారంతో బరువు తగ్గాలనుకుంటే, బేకరీ
ఆహారాలు, జంక్ ఫుడ్ వంటివి
కూడా తినరాదు. అపుడు మీకు శాకాహారం
తప్పక పనిచేస్తుంది.
నేడు
మనం గమనిస్తున్న వారిలో చాలామంది సెలిబ్రటీలు శాకాహారం గొప్పతనాన్ని గుర్తించి, దానికి బాగా అలవాటు పడి
తమ శరీర సౌష్టవాలను అందంగా
ఉంచుకుంటున్నారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు
శాకాహారంలో కూడా తగిన మంచి
ఆహారాలను, సరైన విధానంగా చేసే
వంటకాలను మాత్రమే తింటే అది వారి
బరువు తగ్గే ప్రణాళికకు బాగా
సహకరిస్తుంది.
0 comments:
Post a Comment