హైదరాబాద్:
హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఇటీవల శ్రీమన్నారయణ చిత్రం
ఆడియో వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా
నిలిచారు. ఎప్పుడూ సినిమా వేడుకలకు తన తనయుడిని తీసుకు
రాని బాలకృష్ణ ఆ రోజు మాత్రం
మోక్షజ్ఞను తోడ్కొని వచ్చారు. దీంతో బాలయ్య తాను
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లనున్న తరుణంలో తన తనయుడిని తెలుగు
పరిశ్రమకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగానే మోక్షజ్ఞను వెంట తీసుకొని వచ్చారనే
వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి.
ఇప్పుడు
మోక్షజ్ఞ సినీ పరిశ్రమలో హాట్
టాపిక్ అయ్యాడు. బాలయ్య తన తనయుడిని 2014లోపే
చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన మోక్షజ్ఞ
చదువు నాలుగేళ్ల తర్వాత పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవని,
కేవలం యాధృచ్చికంగానే బాలయ్య ఆడియో వేడుకకు తీసుకు
వచ్చారని మరికొందరు అంటున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత
పరిచయం చేయాలనుకుంటే ఇప్పుడే మోక్షజ్ఞపై హడావుడి ఎందుకు జరుగుతుందనేది మరికొందరి ప్రశ్న. నిప్పు లేకుండా పొగ రాదని అంటున్నారు.
మోక్షజ్ఞ
ఎంట్రీ ఎప్పుడు జరిగినా బాలయ్య ప్లాన్ ప్రకారం వెళుతున్నారని అంటున్నారు. తనయుడి ఎంట్రీపై చెప్పక పోయినప్పటికీ ఓ మంచి నిర్మాత,
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చేతిలో
తనయుడిని పెట్టేందుకు బాలయ్య చూస్తున్నారని అంటున్నారు. ఉన్నత ఆదర్శాలతో శ్రీరామరాజ్యం
వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన
యలమంచిలి సాయిబాబా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు నిర్మాత
అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు
జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్
విషయంలో కూడా బాలయ్య ఆచితూచి
అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే
మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ
మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు బాలయ్య సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వచ్చింది. మోక్షజ్ఞ
నాలుగేళ్ల తర్వాత వచ్చినా, 2014 ముందు వచ్చినా తనయుడి
విషయంలో మాత్రం బాలయ్య ప్లాన్డ్‌గా వెళుతున్నారనే వ్యాఖ్యలు
మాత్రం వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment