లండన్,
ఆగస్టు 10: ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన
మహిళల బాక్సింగ్‌లో కాంస్యం సాధించి
చరిత్ర సృష్టించిన భారత బాక్సర్ మేరీకామ్‌కు పతకం ప్రదానం
చేశారు. గురువారం 51 కేజీల ఫ్లయ్ వెయిట్
ఫైనల్ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది.
ఇక ఫైనల్లో నికోలా ఆడమ్స్ 16-7 పాయింట్ల తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ రెన్ కాన్‌కాన్
(చైనా)పై విజయం సాధించి
స్వర్ణం సొంతంచేసుకుంది.
ఒలంపిక్స్‌లో కాంస్య పతకం
సాధించిన మేరీ కామ్‌కు
మణిపూర్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు
ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. అడిషనల్ ఎస్పీగా పదోన్నతితో పాటు.. మీటీ లాంగోల్ అనే
ఊళ్లో రెండెకరాలు భూమిని కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర
ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్బంలో మణిపూర్
ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ మాట్లాడుతూ
క్రీడల్లో రాష్ట్రానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిందని
అన్నారు.
నాలుగు
రౌండ్లలో నికోలా ఆడమ్స్ వరుసగా 4-2, 5-2, 5-1, 2-2 పాయింట్లతో తన ప్రత్యర్థిపై స్పష్టమైన
ఆధిక్యాన్ని కనబరిచింది. దీంతో మహిళల బాక్సింగ్‌లో తొలి స్వర్ణం
సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో స్దానం సంపాదించింది. సెమీఫైనల్స్‌లో నికోలా చేతిలో
ఓడిన మేరీకామ్ (భారత్), రెన్ కాన్‌కాన్
చేతిలో ఓడిన మార్లెన్ ఎస్పార్జా
(అమెరికా)లకు కాంస్య పతకాలు
అందజేశారు.
60 కేజీల
ఫైనల్లో ఐర్లాండ్‌కు చెందిన కేటీ
టేలర్ 10-8తో రష్యా క్రీడాకారిణి
సోఫియా ఒచిగావాపై గెలిచి స్వర్ణం అందుకోగా.. 75 కేజీల ఫైనల్లో అమెరికాకు
చెందిన క్లారెస్సా షీల్డ్స్ 19-12తో రష్యాకు చెందిన
నాదెజ్దా తొర్లోపోవాపై గెలిచి స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు.
ఇక క్వార్టర్‌ఫైనల్స్ బౌట్‌లో దేవేంద్రో
సింగ్ కూడా ప్యాడీ బార్నెస్
(ఐర్లాండ్) చేతిలో 23-18 తేడాతో ఓడిపోయాడు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ పోరులో
దేవేంద్రో సింగ్ ఐర్లాండ్ బాక్సర్ పాడి బార్నెస్ చేతిలో
పోరాడి ఓడాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో బార్నెస్
23-18 తేడాతో దేవేంద్రోపై విజయం సాధించాడు. దీంతో
ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత పోరాటం
ముగిసింది. లండన్ ఒలింపిక్స్‌కు
కూడా ఎప్పుడూ లేనిది ఏడుగురు బాక్సర్లు వెళ్లడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా పతకం సాధించలేకపోయారు.
ఐతే మహిళల విభాగంలో మేరీకోమ్
కాంస్యం గెలిచి కాస్త ఊరట కలిగించింది.
ఇక ఈనెల 12(ఆదివారం)న జరగనున్న 66 కేజీల
ఫ్రీ స్టయిల్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గేందుకు
శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు.
0 comments:
Post a Comment