"లాజిక్
లు ఎవరూ నమ్మరు.. అందరకీ
మ్యాజిక్ లే కావాలి... అందుకే
మన దేశంలో సైంటిస్టు కన్నా బాబాలే ఫేమస్..."
వంటి డైలాగులతో త్రివిక్రమ్ జులాయి దిగిపోయాడు. అయితే ఇంతంత తెలివిగా
మాట్లాడే హీరో అడ్డదారిలో పోయి,
దెబ్బతిని జీవితం విలువ తెలుసుకున్నాడన్నాడంటేనే కాస్త ఇబ్బందిగా
అనిపిస్తుంది. మాస్ టైటిల్, జోష్
ఉన్న హీరో, క్లాస్ టచ్
ఉన్న డైరక్టర్ వీరి కాంబినేషన్ అంటే
అన్ని వర్గాల్లోనూ ఆసక్తే...అంచనాలూ అధికమే. ముఖ్యంగా మాస్ లో అల్లు
అర్జున్ కి ఉన్న క్రేజే
వేరు. అయితే తెలివైన హీరోయిజం,
స్టైలిష్ గా నడిచే కథనం
కొంతవరకూ కొత్తగా అనిపించినా అల్లు అర్జున్ ఇమేజ్
ను ఎలివేట్ చేస్తూ సాగలేదు. దాంతో ఓ యావరేజ్
సినిమాగా మిగిలిపోయే అవకాశం ఉంది.
రవీందర్
నారాయణ(అల్లు అర్జున్) తెలివైన
నేటి తరం కుర్రాడు..అయితే
కష్టపడకుండా ఓవర్ నైట్ లో
ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అది
అతని తండ్రి నారాయణ మూర్తి(తణికెళ్ల)కి నచ్చదు. ఓ
రోజు తండ్రితో ఎప్పటిలాగే తగువు పడి పదివేలు
పట్టుకెళ్లి ఐదు లక్షలుతో తిరిగివస్తానని
క్రికెట్ బెట్టింగ్ కి వెళతాడు. అక్కడ
నుంచి అతని లైఫ్ అనుకోని
మలుపు తిరిగుతుంది. బిట్టు(సోనూ సూద్)అనే
ఓ తెలివైన దొంగ తన గ్యాంగ్
తో చేసిన 1500 కోట్ల బ్యాంక్ దోపిడికి
విట్నెస్ గా మారి.. క్రిమినల్స్
కి మోస్ట్ వాంటెడ్ గా మారతాడు. అక్కడ
నుంచి పోలీసులు, క్రిమినల్స్ అతని జీవితం అయిపోతుంది.
ఈ క్రమంలో అతనికో అమ్మాయి మధు(ఇలియానా) పరిచయం
అవుతుంది. క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటూ ఆమె
ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది
మిగతా కథ.
2008లో
వచ్చిన డార్క్ నైట్ చిత్రంలోని జోకర్,
బ్యాట్స్ మ్యాన్ పాత్రలను గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం
కూడా ఓ బ్యాంక్ దొంగతనం
తోనే ప్రారంభం అవుతుంది. అయితే కథకు ఎత్తుగడ
క్రైమ్, పనిష్ మెంట్ తరహాలో
ఎత్తుకున్నారు. కానీ హీరో ఓరియెంటేషన్
తో కథ, కథనం నడపటంతో
హీరో బెట్టింగ్ కి వెళ్లి తనకు
సంబంధం లేని క్రైమ్ లో
పడి ఇబ్బందులు పడ్డాడని చెప్పినా ఆ విషయం కేవలం
డైలాగుకే పరిమితమైంది. స్క్రీన్ ప్లే లో ట్విస్ట్
లు బాగానే పేలాయి కానీ... కథకు బలానివ్వలేకపోయాయి. ముఖ్యంగా ఇంటర్వల్
వరకూ నడిచినంత వేగంగా సెకండాఫ్ నడవకపోవటం కాస్త అసహనానికి గురి
చేసే అంశం. లవ్ ట్రాక్
విషయానికి వస్తే త్రివిక్రమ్ ఈ
సారి సక్సెస్ కాలేదనిపిస్తుంది. దానికి తోడు ఇలియానా బక్కపలుచగా
కనిపించడం కూడా ఆ సీన్స్
కు మైనస్ గా మారింది.
రాజేంద్రప్రసాద్ పాత్రను కామెడీ కోసం అన్యాయం చేసారనిపిస్తుంది.
ఎందుకంటే విలన్ ని తన
ప్రక్క నున్న హీరో ధైర్యంగా
ఎదుర్కొంటూంటే.. పోలీస్ గా రాజేంద్రప్రసాద్ మాత్రం
ఏం చేయకుండా చూస్తూండిపోతాడు. అలాగే అన్ని వందల
కోట్లు దొంగతనం జరిగినా పోలీస్, ఇతర దర్యాప్తు సంస్థలుపట్టించుకున్నట్లు
కనపడవు..హీరో మాత్రమే...ఆ
బ్యాంక్ దొంగతనం ఎలాగైనా పట్టుకోవాలని పోరాడుతూంటాడు.
ఇక అల్లు అర్జున్ నుంచి
ప్రేక్షకులు ఆశించే హీరోయిజం స్టైలిష్ టేకింగ్ హడావిడిలో కనపడకుండా పోయింది. రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే ఆయనకు, అల్లు
అర్జున్ కి వచ్చే ట్రాక్
తమిళ వెట్టై ని గుర్తు చేసినా
బాగానే పేలింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో
రెగ్యులర్ గా హైలెట్ అయ్యే
బ్రహ్మానందం.. చిల్లర దొంగతనాలు కామెడీ పెద్దగా నవ్వులు పూయించలేకపోయింది. ఎమ్.ఎస్ నారాయణ,
హేమ ఎప్పటిలాగే తమ పరిధిలో చేసుకుపోయారు.
తణికెళ్ల భరిణి ఏ సినిమాలో
చూసినా అదే తండ్రి పాత్ర
కాబట్టి పెద్దగా చెప్పుకునేందుకు లేదు. అల్లు అర్జున్
మాత్రం ఎప్పటిలా తన దైన శైలిలో
డాన్స్ లు, హుషారుతో స్క్రీన్
సేవ్ చేసారు. త్రివిక్రమ్ డైలాగుల్లో గతంలో పంచ్ మాయమైంది.
అక్కడక్కడ మాత్రమే ప్రాసలు పేలాయి. దర్సకుడు మాత్రం ఓ కొత్త తరహా
సినిమాకు ట్రై చేసాడని చెప్పవచ్చు.
కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత ట్రిమ్
చేస్తే బావుండేది. పాటల్లో టైటిల్ సాంగ్, మధు..మధు బాగున్నాయి.
రీ రికార్డింగ్ చాలా సీన్స్ కు
ప్లస్ అయ్యింది.
ఫైనల్
గా... రెగ్యులర్ ధోరిణిలో కాకుండా ఓ కొత్త కథతో
సినిమా చేయటానికి ప్రయత్నించినందుకు త్రివిక్రమ్ ని అబినందించాలి. అయితే
త్రివిక్రమ్ నుంచి రెగ్యులర్ గా
ఆశించే పంచ్ లు కోసం
కామెడీ కోసం వెళితే కాస్త
నిరాస వస్తుంది. అల్లు అర్జున్ కొత్త
సినిమా... చూద్దాం అని వెళితే ఓకే
అనిపిస్తుంది.. అంతే.
0 comments:
Post a Comment