హైదరాబాద్ : నందమూరి నట సింహం బాలకృష్ణకు మరో ఉత్తమ నటుడి అవార్డు వరించింది. శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరాముడి పాత్రలో ఉత్తమ నటన కనబర్చినందుకుగాను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో బాలయ్యకు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డు అందుకున్నారు.
అదే విధంగా సీత పాత్రలో అద్భుతంగా నటించిన నయనతార కూడా పలు అవార్డులు సొంతం చేసుకుంది. అదే విధంగా రచయిత జొన్నవిత్తులకు బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్, పిఆర్‌కె రాజు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు శ్రీరామరాజ్యం చిత్రానికిగాను అందుకున్నారు.
'సంతోషం' పత్రిక వార్షికోత్సవం సంధర్భంగా జరిగిన 'సంతోషం అవార్డు'ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బాలయ్య గతంలో 2009 సంతోషం అవార్డుల ఫంక్షన్లోనూ పాండురంగడు చిత్రంలోని నటనకుగాను సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

0 comments:
Post a Comment