హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రాణా దగ్గుబాటి సోదరి మాలవిక ఎంగేజ్‌మెంట్ ఆదివారం(ఆగస్టు 12) భరత్ అనే వ్యక్తితో జరిగింది. చిత్తూరు వాస్తవ్యులైన భరత్ కుటుంబం బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారికి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం.
మాలివిక మేనేజ్‌మెంట్ కోర్సులో గాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం కార్వీ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తోంది. వెంకటేష్ వైఫ్ నీరజ అంకుల్ ఈ సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5న మాలివిక-భరత్ వివాహం అంగరంగ వైభవంగా జరిపేందుకు సురేష్ బాబు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమది సినిమా కుటుంబమే అయినా....మాలివిక పూర్తిగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. తమ కుటుంబానికి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు కూడా మాలవిక దాదాపుగా దూరంగా ఉంది. ఆమె పెళ్లి కూడా పూర్తిగా సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తితోనే చేస్తున్నారు. గతంలో రామానాయుడి కూతురు లక్ష్మిని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత విడాకులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాలవికను సినీ పరిశ్రమతో సంబంధంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

0 comments:
Post a Comment