హైదరాబాద్: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు అంజుతో నాని ఎంగేజ్ మెంట్ ఆదివారం జరిగింది. నాని తాజాగా తాజాగా కొన్ని నిమిషాల క్రితం తన ఎంగేజ్ మెంట్ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అయితే గతంలో అంజుతో ఎంగేజ్ మెంట్ జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన నాని...ఇప్పుడు ఆమెతోనే ఏడడుగులకు సిద్ధం అవ్వడం గమనార్హం. ఈమెతో నానికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ....తమ పరిచయ వివరాలను నాని ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు.
నాని ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంతో, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి ‘జెండాపై కపిరాజు' అనే టైటిల్ ఖరారు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన ‘ఈగ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

0 comments:
Post a Comment