హైదరాబాద్: మహిళా మంత్రులకు మినహా మిగతా మంత్రులకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం గాజులు, బొట్టు, కుంకుమ భరిణెలు పంపుతున్నట్లు చెప్పారు. పౌరుషం, బుద్ధి వచ్చేందుకే వారికి తాను వీటిని మంత్రులకు కొరియర్ చేయనున్నట్లు చెప్పారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.
ఆయన శనివారం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులపై మండిపడ్డారు. మంత్రులు చేతకాని, పనికిరాని, దద్దమ్మలుగా అభివర్ణించారు. గతంలోలాగా విద్యార్థుల మొత్తం బోధనా ఫీజును భరించేలా ప్రభుత్వంపై మంత్రులు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై వారు సిఎంపై దండయాత్ర చేస్తారో లేక రాజీనామా చేస్తారో తేల్చుకోవాలన్నారు.
మంత్రుల ఉపసంఘం ప్రతిపాదనలు దుర్మార్గమైన చర్యలన్నారు. మంత్రులంతా ముఖ్యమంత్రి ముందు కూర్చొని బోధనా ఫీజుల పథకాన్ని అమలు చేయించాలని కోరారు. గాజులు పంపిస్తే మంత్రుల్లో పౌరుషం వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. బిసి విద్యార్థులపై ఫీజుల భారం విషయంలో పార్టీలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని, అయినా ముఖ్యమంత్రి మాత్రం అసలు ఈ విషయం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 26 జివోలకు సంబంధించిన అంశంలో ఒక్క మంత్రినే జైలుకు పంపారని... మిగిలిన వారికి ముఖ్యమంత్రి రక్షణ కల్పిస్తున్నట్లుగా ఉందన్నారు. దోషులకు న్యాయ సహాయం అవసరమా అని తలసాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

0 comments:
Post a Comment