న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు పెట్టిన గేట్లను తొలగించాలా, వద్దా అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికే వదిలేసింది. 'గేట్లు తీసేయించమమంటారా!?' అని జడ్జి అడిగిన సూటి ప్రశ్నకు... 'మీ ఇష్టం' అని బదులిచ్చింది. అయితే, వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలిపింది. అయితే, ఆ పరిష్కారం గురించి బహిరంగంగా చెప్పలేమని, ధర్మాసనానికి రహస్యంగా చెబుతానని రాష్ట్రప్రభుత్వ న్యాయవాది అన్నారు.
మహారాష్ట్ర తన తాగునీటి అవసరాల కోసం 0.60 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అంగీకరిస్తామని కూడా తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి ప్రవేశించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తుండటంతో 2006లో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు కట్టుకోవచ్చునని, గేట్లు మాత్రం పెట్టొద్దని అప్ప ట్లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గురువారం జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.ఆర్.దవేల ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.
రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది పరాశరన్ వాదన లు వినిపించారు. "అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ను ఒక రాష్ట్రం ఉల్లంఘించటం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలంలో జలాశయాన్ని నిర్మించటం సరికాదు. ట్రిబ్యునల్ నిబంధనలను కూడా ఉల్లంఘించి బాబ్లీ నిర్మాణం చేపట్టారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య గొడవలు మొదలయ్యాయి'' అని తెలిపారు.
శ్రీరాంసాగర్ జలాశయం గరిష్ఠ నీటినిల్వలో పావు వంతు నీరు బాబ్లీ ప్రాజెక్టులోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకూర్ స్పందిస్తూ.. కోర్టు గేట్లు పెట్టొద్దని ఆదేశించిందా? లేక వాటిని నిర్వహించొద్దని (ఆపరేట్) ఆదేశించిందా? అని ప్రశ్నించారు. గేట్లను పెట్టొద్దనే ఆదేశించిందని పరాశరన్ బదులిచ్చారు. "గేట్లను అమర్చిన తర్వాత వాటిని ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. తద్వారా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టులో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది'' అని తెలిపారు.
దీంతో జస్టిస్ ఠాకూర్ స్పందిస్తూ.. "పెట్టిన గేట్లను తీసేయించమంటా రా?'' అని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని ధర్మాసనం విచక్షణాధికారానికే వదిలి వేస్తున్నట్లు పరాశరన్ బదులిచ్చారు. "దీనికి సామరస్యపూర్వక పరిష్కారం నా వద్ద ఉంది. అయితే, మీడియా ప్రతినిధులున్న కోర్టు హాలులో బహిరంగంగా చెప్పలేను. ధర్మాసనానికి రహస్యంగా చెబుతాను'' అని తెలిపారు.
మహారాష్ట్ర తమకు కరువు ఉందంటోందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ కరువుందని తెలిపారు. తాగు, సాగు, జలవిద్యుదుత్పాదనలకు ప్రథ మ, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నది లో సమృద్ధిగా నీరుంటే ఏమైనా చేసుకోవచ్చునని తెలిపారు. "తాగునీటికి 0.6 టీఎంసీలు సరిపోతాయని మహారాష్ట్ర చెబుతోంది. అందుకు అభ్యంతరం లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కూ తాగునీరు కావాలి. బాబ్లీలో 2.74 టీఎంసీల నీటి నిల్వకు మాత్రం అంగీకరించేది లేదు'' అ ని పరాశరన్ స్పష్టంచేశారు.
స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర నీరు ఉపయోగించుకోవచ్చన్నారు. దీనిపై మహారాష్ట్ర న్యాయవాది అంధ్యార్జున వాదిస్తూ... శ్రీరాంసాగర్ సామ ర్థ్యం 112 టీఎంసీలు కాగా, తాము కోరుతున్నది కేవలం 0.6 టీఎంసీలు మాత్రమేనన్నారు. అవసరమైతే సంవ త్సరంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ నీటిని తిరిగి ఇస్తామని వెల్లడించారు. నిజానికి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో గతంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, బాబ్లీ ఎత్తును 3.6 మీటర్లు తగ్గించుకునేందుకు తాము అంగీకరించామని చెప్పారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందుకు అంగీకరించలేదన్నారు. దీనికి రాష్ట్రప్రభుత్వ న్యాయవాది మరొకరు స్పందిస్తూ - మహారాష్ట్ర చేస్తున్న వాదన సరికాదని, సీడబ్ల్యూసీ సమావేశంపై తాము ఎన్నిసార్లు లేఖలు రాసినా మహారాష్ట్ర స్పందించలేదని చెప్పారు. అంధ్యార్జున తన వాదనలు కొనసాగిస్తూ - రెండు రాష్ట్రాలు సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, ముగ్గురు లేదా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిష్కరించటం ఉత్తమమని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ప్రాథమిక వాదనలను నివేదిక రూపంలో సమర్పించాలని, తద్వారా తాము కూడా ఈ కేసును సమగ్రంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఇది చాలా పాత కేసు కాబట్టి, దీన్ని త్వరగా పరిష్కరించాల్సి ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. అప్పటికే కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.

0 comments:
Post a Comment