హైదరాబాద్ : ఇట్స్ మై లవ్ స్టోరీ,స్నేహ గీతం చిత్రాలు దర్శకుడు మధుర శ్రీధర్ త్వరలో మరో చిత్రం ప్రారంభించనున్నారు. '123'టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ 20 వ తేదీన హైదరాబాద్ శిర్జీ సాయిబాబా గుడిలో ఈ చిత్రం పూజతో ప్రారంభం అవనుంది. అక్టోబర్ నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతంది. ఈ చిత్రానికి మొదట బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ని హీరోగా అనుకున్నారు కానీ ఇప్పుడు మహత్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.
ఇక ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ '1 లైఫ్, 2 లవ్స్, 3 హార్ట్స్ '. అలాగే హీరోయిన్ గా ఎవరినీ ఇంకా ఎంపిక చేయలేదు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని మధుర శ్రీధర్ చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం విక్కీ డోనర్ అని బయిట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన్ని మీడియావారు ప్రశ్నించగా...'123'చిత్రం విక్కీ డోనర్ రీమేక్ కాదు. విక్కీ డోనర్ రీమేక్ మీద నేను డిసెంబర్ నుంచి కూర్చుంటాను. ఈ చిత్రం పూర్తి కాగానే ఆ చిత్రం ప్రారంభం అవుతుంది అన్నారు.
ఈ చిత్రంలో హారోగా ఎంపిక చేసిన మహత్ మరెవరో కాదు. ఆ మధ్యన తాప్సీ విషయమై మంచు మనోజ్ తో గొడవలు పడి పోలీస్ స్టేషన్ లో కేసులు అవీ పెట్టిన తమిళ హీరోనే. ఆ తర్వాత తాప్సీ వాళ్లు గొడవ పడింది నా గురించి కాదనీ వివరణ ఇచ్చింది. అయితే తమిళ మీడియా మాత్రం మహత్ ని ఇప్పటికీ తాప్సీ బోయ్ ప్రెండ్ గానే అభివర్ణిస్తోంది.
తాజాగా మహన్ ని తెలుగు దర్శకుడు మధురా శ్రీధర్ తన సినిమాలో హీరోగా తీసుకోవటంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు బయిటకు వస్తే మరెన్ని తెలుగు సినిమా ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నారు.

0 comments:
Post a Comment