1. నిమ్మరసం: కొవ్వు తగ్గించాలను కొనే వాళ్ళకు నిమ్మరసం బెస్ట్ అయితే తీపి కలిగిన పానీయాలకంటే మంచినీళ్ళు తాగడమే ఉతమమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై కాలిఫోర్నియాలో 240 మంది మహిళలపై అధ్యయనం జరిపిన న్యూట్రిషనిస్ట్ లు ఇతర తీపి పానీయాలకంటే మంచినీళ్ళు మంచివని తేల్చారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూనే రోజు మొత్తంలో వీలైనప్పుడల్లా మంచినీళ్లు తాగడం వల్ల ఏడాదికి అదనంగా ఒక కిలో వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్ళలో కూడా కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే మరీ మంచిదని, మరో కిలో కొవ్వు కరిగిపోతుంది.
2. వాల్ నట్స్: ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడో, సినిమా హాల్లో వెండితెరను వీక్షిస్తున్నప్పుడో చిప్ప్ తినడం చాలా మందికి అలవాటు. ఇలా చిప్స్ తినే బదులు నట్స్ తినడం మంచిదని, అందులోనూ వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. వాల్ నట్స్ ఉండే ఒమేగా 3ఫాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కరించడంలో బాగా తోడ్పడతాయి. రోజూ 8 నుంచి 10 వాల్ నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గిపోతుందని వారు అంటున్నారు.
3. దాల్చిన చెక్క: కాఫీ లేదా టీలో పంచదార బదులు కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే, మీరు వేసుకునే ఒక టీస్పూన్ చక్కరలోనే 16కాలరీలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. మరి రోజుకి కనీసం నాలుగైదుసార్లు టీ, కాఫీలు తాగే వారు ఎందరో!ఈ లెక్క వారి శరీరంలోకి ఒక్కటి, కాఫీల ద్వారానే రోజూ 80కేలరీల వరకూ చేరిపోతున్నాయి. పంచదారకు బదులు దాల్చిన చెక్క పొడి వేసుకోవడం ద్వారా ఈ కేలరీలు శరీరంలోకి చేరకుండా అడ్డుకట్ట వేయడమేకాకుండా గుండెను కూడా పదిలంటా కాపాడుకోవచ్చు. నిత్యం అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడి తినడం వల్ల కొలెస్ట్రాల్ ద్వారా గుండెకు కలిగే చేటును చాలా వరకూ తగ్గిస్తుంది.
4. గ్రనోలా బార్స్ : ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లిసాడోఫిమాన్ పేర్కొంటున్నారు. రిఫైన్డ్ ఫుడ్ (పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారం)రక్తంలోని చక్కెర నిల్వలను మరింత పెంచుతాయని, దీనికన్నా ప్రతిరోజూ 4గ్రాముల గ్రనోలా బార్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.
5. సాల్మన్ ఫిష్: కేవలం 90గ్రాముల కేన్డ్ సాల్మన్ ఫిష్ తినడం ద్వారా మీ శరీరానికి రోజంతా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా డి విటమిన్, 180మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయి. శరీరానికి సరిపడా విటమిన్ డి గనుక లభించకుంటే ఆకలిని కలిగించే లెప్టిన్ హార్మోన్ తన విధులు సరిగా నిర్వర్తించదట. చేపలు కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే చేపలు ట్యూనా, సాల్‌మన్, స్వార్డ్‌ఫిష్, ప్లాడర్.

0 comments:
Post a Comment