Thursday, April 12, 2012

హైటెక్ బాబుకు జగన్ కౌంటర్, మోడీ బాటలో


హైదరాబాద్: హైటెక్ హంగులతో అదరకొడుతూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాటలో కొత్త సాంకేతిక పరిజ్ఝానాన్ని వైయస్ జగన్ సమకూర్చుకున్నారు. పార్టీ కార్యకలాపాలను తెలుసుకోవడానికి అవసరమైన కొత్త అప్లికేషన్ను ఆయన సమకూర్చుకున్నారు.

పార్టీ రోజువారీ కార్యకలాపాలతో పాటు ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెస్తుంది. చంద్రబాబుపై పైచేయి సాధించడానికి వైయస్ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే 18 శానససభా స్థానాలు, లోకసభ ఉప ఎన్నికల్లో దీన్ని ఆయన విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో మొబైల్ వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారని, వారందరి చెంతకు చేరడానికి, ప్రత్యేకంగా యువకులను, విద్యార్థులను, స్మార్ట్ ఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి అప్లికేషన్ ఉపయోగపడుతుందని, వారికి పార్టీకి సంబంధించిన తాజా సమాచారాన్ని చేరవేయడం సులభమవుతుందని, తమ పార్టీకి చెందిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్న తెలుగు ఎన్నారైలకు సమాచారం అందించడానికి ఉపయోగపడుతుందని వైయస్ జగన్ అంటున్నారు.

ఇండిసిస్ సిస్టమ్స్ సిఇవో, పార్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సభ్యుడు సురేష్ బొమ్మ అప్లికేషన్ను రూపొందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హైటెక్ హంగులు సమకూర్చుకుని ఐమోడీగా పేరు సంపాదించుకున్నారు. మోడీ అప్లికేషన్ బిజెపికి సంబంధించిన దృక్పథాన్ని తెలుసుకోవడానికి, గుజరాత్ ప్రభుత్వంతో సంబంధాలను పెట్టుకోవడానికి సామాన్యులకు ఉపయోగపడుతుంది.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget