గడచిన
నెలలో (మార్చి 2012) జరిగిన జెనీవా మోటార్ షోలో బిఎమ్డబ్ల్యూ
గ్రూపుకు చెందిన ప్రీమియం కార్ల తయారీ బ్రాండ్
"మినీ" ఆవిష్కరించిన క్లబ్వ్యాన్ కాన్సెప్ట్
అతిత్వరలోనే ఉత్పత్తి స్థాయికి చేరుకోనుంది. కూపే, క్యాబ్రియోలెట్, ఎస్యూవీ వంటి మోడళ్ల
తర్వాత తొలిసారిగా మినీ ప్రవేశపెట్టిన ఈ
సరికొత్త క్లబ్వ్యాన్ కాన్సెప్ట్కు మార్కెట్ నుండి
మంచి స్పందన లభించడంతో వీలైనంత త్వరగా ఈ కాన్సెప్ట్ను
ప్రొడక్షన్ స్టేజ్కు తీసుకురావాలని కంపెనీ
సన్నాహాలు చేస్తుంది.
ఎస్టేట్
కార్, డెలివరీ వ్యాన్ వంటి బాడీస్టైల్ కలిగిన
కార్లకు పోటీగా మినీ తమ ఈ
క్లబ్వ్యాన్ను ప్రవేశపెట్టనుంది. మినీ
బ్రాండ్ నుండి అత్యంత పాపులర్
అయిన 'క్లబ్మ్యాన్' ఎస్యూవీ మోడల్ ఆధారంగా
క్లబ్వ్యాన్ కాన్సెప్ట్ను కంపెనీ రూపొందించింది.
ఇందులో రెండు సీట్లు మాత్రమే
(డ్రైవర్ + ప్యాసింజర్) ఉండి, ఐదు డోర్లను
కలిగి ఉంటుంది.
వెనుకవైపు
ఉండే రెండు క్యాబిన్ డోర్లు
గవ్వ (షెల్) మాదిరిగా ఒకటి
కుడివైపుకు మరొకటి ఎడమవైపుకు ఓపెన్ అవుతాయి. ఈ
క్లబ్వ్యాన్ కాన్సెప్ట్ ఒకపట్టి మారియోస్ మినీ ట్రావెలర్ను
గుర్తుకు తెస్తుందని, స్టైలిష్ యుటిలిటీ వెహికల్ కోరుకునే వారి కోసం ఈ
కాన్సెప్ట్ను అభివృద్ధి చేశామని
మినీ పేర్కొంది. మరి ఈ మినీ
క్లబ్వ్యాన్ను కూడా బిఎమ్డబ్ల్యూ ఇండియాకు తీసుకువస్తుందో లేదో వేచి చూడాల్సి
ఉంది.
0 comments:
Post a Comment