ఈ ఫోటోలోని కారును గుర్తు పట్టారా..? ఇది గడచిన జనవరిలో
జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో
2012లో మారుతి సుజుకి ఇండియా విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్యూవీ కాన్సెప్ట్ 'ఎక్స్ఏ
ఆల్ఫా'. ప్రస్తుతం మారుతి సుజుకి విడుదల చేసిన తొలి యుటిలిటీ
వెహికల్ ఎర్టిగా ఎల్యూవీ (లైఫ్
యుటిలిటీ వెహికల్) మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో
(ఇది విడుదలైన ఐదు రోజుల్లోనే 10 వేల
యూనిట్లకు పైగా బుకింగ్లను
సొంతం చేసుకుంది) యుటిలిటీ వాహన సెగ్మెంట్లో తన
మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు కంపెనీ
సన్నాహాలు చేస్తుంది.
ఇందులో
భాగంగానే మారుతి సుజుకి ఆవిష్కరించిన ఈ కాన్సెప్ట్ కారును
వీలైనంత త్వరగా ఉత్పత్తి దశకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు
సమాచారం. వాస్తవానికి మరో రెండు-మూడేళ్ల
తర్వాత ఈ కాంపాక్ట్ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకురావాలని మారుతి సుజుకి భావించింది. అయితే, కంపెనీ ఇటీవల కాలంలో కోల్పోయిన
మార్కెట్ వాటాను తిరిగి వేగంగా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎక్స్ఏ ఆల్ఫా ఎస్యూవీ
ఉత్పత్తి దశకు తీసుకురావటానికి పనులను
వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
మారుతి
సుజుకి ఢిల్లీ ఆటో ఎక్స్పోలో
విడుదల చేసిన ప్రోటోటైప్ కాంపాక్ట్
ఎస్యూవీ స్పోర్ట్స్ యుటిలిటీ
వాహనం (ఎస్యూవీ) "ఎక్స్ఏ
ఆల్ఫా" విషయానికి వస్తే దీనిని విభిన్న
వనరుల నుండి స్ఫూర్తి పొంది
డిజైన్ చేయటం జరిగింది. మల్లయోధుల
(కుస్తీ ఆటగాళ్లు) పట్టు నుండి స్పూర్తి
పొంది డిజైన్ చేసిన ఫ్రంట్ డిజైన్,
రియర్ డిజైన్ మరియు రెడ్ కలర్,
డేగ కన్నును ప్రేరణగా తీసుకొని రూపొందించిన సరికొత్త షార్ప్ హెడ్ ల్యాంప్, ఆకర్షనీయమైన
ఫ్రంట్ గ్రిల్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో ఈ
సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీని మారుతి
సుజుకి రూపొందించింది.
కేవలం
తొమ్మిది నెలల సమయంలోనే మారుతి
సుజుకి తమ ఎక్స్ఏ ఆల్ఫా
కారును డిజైన్ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకి దేశీయ విపణిలో అందిస్తున్న
జిప్సీ ఎస్యూవీ తర్వాత
ఎక్స్ఏ ఆల్ఫా ఎస్యూవీనే
మొదటిది కానుంది.
0 comments:
Post a Comment