విజయవాడ:
రెండు రోజుల క్రితం విజయవాడలో
అపహరణకు గురైన ఫైనాన్స్ వ్యాపారి
కుమారుడు జితేష్ వర్మ ఆచూకీని పోలీసులు
కనిపెట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎనిమిదేళ్ల ఆ బాలుడిని కిడ్నాప్
చేసిన ముఠా హైదరాబాదులో ఉన్నట్లు
పోలీసులు కనిపెట్టి, దాడి చేసారు. నిందితులను
అదుపులోకి తీసుకుని విచారించారు.
డబ్బు
కోసమే జితేష్ వర్మను కిడ్నాప్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ అపహరణలో సునీత
అనే మహిళ కూడా పాత్ర
పోషించినట్లు పోలీసులు కనిపెట్టారు. డబ్బు కోసమే బాలుడిని
కిడ్నాప్ చేసినట్లు ఆ మహిళ అంగీకరించింది.
బాలుడ్ని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి
పోలీసులు విజయవాడకు తరలించారు.
విజయవాడలోని
ముత్యాలపాడులోని ఓ పాఠశాలలో జీతేష్
వర్మ మూడో తరగతి చదువుతున్నాడు.
ఇంటి నుంచి పాఠశాలకు ఉదయం
తొమ్మిది గంటలకు బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాలేదు. పాఠశాలకు వెళ్లక ముందే బాలుడ్నిని దుండగులు
కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తే టూవీలర్పై బాలుడ్ని తీసుకుని
వెళ్లారని దర్యాప్తులో పోలీసులు కనిపెట్టారు. దాని ఆధారంగా ముందుకు
సాగారు.
తండ్రికి
శుక్రవారం సాయంత్రం కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చింది.
బాలుడిని వదిలిపెట్టడానికి మూడు కోట్ల రూపాయలు
ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తర్వాత కోటిన్నర రూపాయలకు దిగి వచ్చినట్లు సమాచారం.
అయితే అప్పటి వరకు బాలుడి తల్లిదండ్రులు
పోలీసులకు చెప్పలేదు. విషయం తెలిసి విజయవాడ
పోలీసు కమిషనర్ బాలుడి తండ్రిని పిలిపించి సమాచారం రాబట్టారు. పూర్తి విషయాలు చెప్పడానికి బాలుడి తండ్రి నిరాకరించాడు. అయినా పోలీసులు దర్యాప్తు
చేపట్టి బాలుడ్ని విడిపించారు.
0 comments:
Post a Comment