కడప:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
శనివారం కడప జిల్లాలో చేపట్టిన
ప్రజాపథం కార్యక్రమానికి ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
డిఎల్ రవీంద్రా రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్న విషయం తెలిసిందే. కడప
జిల్లా ఉప ఎన్నికల సమీక్షకు
కూడా డిఎల్ రవీంద్రా రెడ్డి
దూరంగా ఉంటున్నారు. ఈ స్థితిలో ఆయన
ముఖ్యమంత్రి ప్రజాపథం కార్యక్రమానికి హాజరు కాలేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కడప జిల్లా రైల్వో కోడూరులో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో మహిళలకు వరాల వర్షం కురిపించారు.
మహిళలకు
జనవరి 1వ తేదీ నుంచి
వడ్డీ లేని రుణాలు ఇస్తామని
ఆయన హామీ ఇచ్చారు. మహిళల
వల్లనే కుటుంబాలు ప్రగతి సాధిస్తాయని, అందుకే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని,
ఆస్తి హక్కును కల్పించామని ఆయన చెప్పారు. మహిళలకు
బ్యాంకుల ద్వారా గారంటీ అవసరం లేకుండా 15,500 కోట్ల
రూపాయల రుణాలు ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో
మంచినీటి సమస్య పరిష్కారానికి వంద
కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన
తెలిపారు. రైతులకు ఏడు గంటల పాటు
ఉచితంగా విద్యుత్తు ఇవ్వడానికి యూనిట్కు 9 రూపాయలు ఖర్చు
చేస్తున్నామని ఆయన అన్నారు. పేదలపై
విద్యుత్ చార్జీల భారం పడకుండా చర్యలు
తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సంపన్నులపైనే
భారం వేస్తున్నామని, అయితే ప్రతిపక్షాలు సంపన్నులకు
మేలు చేయడానికి తమపై విమర్శలు చేస్తున్నాయని
ఆయన అన్నారు.
సమస్యలు
తెలుసుకుని పరిష్కరించడానికే ప్రజాపథం కార్యక్రమం చేపట్టామని, రాష్ట్రంలో 20 రోజుల పాటు ఈ
కార్యక్రమం సాగుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులకు
ఉపకార వేతనాలు ఎక్కడా ఆపలేదని, 27 లక్షల మంది విద్యార్థులకు
ఉపకార వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. రేషన్
కార్డులు పెంచామని, దీనిపై ప్రభుత్వంపై విమర్శలు తగవని ఆయన అన్నారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని
రూపాయికి తగ్గించామని ఆయన చెప్పారు. మీ
సేవా కార్యక్రమం ద్వారా లంచాలు ఇవ్వకుండా కార్యాలయాల్లో పనులు జరిగేలా చర్యలు
తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment