లేట్
నైట్ పార్టీలు, పూర్తిగా తాగేయటం ఆనందించేయటం వంటివి మీ శరీరంలో కొవ్వు
పెంచుతాయి. కనుక కుండలాంటి పొట్ట
మీ శరీరానికి రాకుండా వుండాలంటే, మీరు తాగే ఆల్కహాల్
పానీయాలు సరైనవిగా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మీరు
తాగే ఆల్కహాల్ లో కొవ్వు లేదని
గ్రహించండి. కాని తాగుడు బరువు
పెంచుతుంది. దానికి కారణం ఆల్కహాల్ త్వరగా
ఆక్సిడేషన్ చెందుతుంది. వెంటనే మీ లోని కొవ్వు
కరిగించే ప్రక్రియను నెమ్మదిస్తుంది. మీరు కనుక స్నేహితులతో
కలసి బాగా తాగేసే వారైతే,
తక్షణం దానిని నిలుపు చేయండి. అధికంగా కొవ్వును కలిగించే ఈ 5 ఆల్కహాల్ పానీయాలు
వదిలేస్తే మీరు మీ శరీర
బరువును నియంత్రించుకుంటూ, ఆనందకర జీవన విధానం ఆచరించవచ్చు.
కొవ్వును
అధికం చేసే 5 ఆల్కహాల్ పానీయాలు
1. బీరు
- బీరులో లైట్ బీర్ అని
కూడా వుంది. అది ఎంత లైట్
అయినప్పటికి మీకు 110 కేలరీలు చేరుస్తుంది. బీరులో ఆల్కహాల్ వెరైటీలన్నింటిలోకంటే కేలరీలు అధికం. చాలామంది వేసవిలో బీరు తాగితే, శరీర
మలినాలు పోతాయనుకుంటారు. కని వాస్తవంగా, బీరు
శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. రెగ్యులర్ బీరు లో 150 నుండి
170 కేలరీలు శక్తి, 7 గ్రాములు కార్బోహైడ్రేట్లు వుంటాయి. కనుక బరువు తగ్గాలనుకునేవారికి
బీరు మంచిది కాదు.
2. షాంపేన్
- సాధారణంగా షాంపేన్ వేడుకలలో వాడతారు. ఈ పానీయాన్ని నిజంగా
ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయాలి. బీరు తర్వాత కొవ్వు
పెంచే వాటిలో షాంపేన్ మొదటిది. షాంపేన్ తాగటం విలాసవంత జీవనానికి
చిహ్నంగా వుంటుంది. కాని ఆరోగ్యానికి మంచిది
కాదు. ఈ డ్రింక్ ఒకసారి
తాగితే 90 కేలరీలు వస్తుంది కనుకు అప్పుడపుడు తాగటమే
మంచిది.
3. వైన్
- వైన్, వుమన్ రెండూ కూడా
వయసు పైబడే కొలది మరింత
నాణ్యతగాను, అందంగాను తయారవుతాయంటారు. అయితే, మీరు అధిక కాలం
జీవించాలనుకుంటే, వైన్ అధికంగా తాగరాదు.
అందులో ప్రతి గుక్కకి 80 కేలరీలు
వచ్చి చేరతాయి. మీరు రెగ్యులర్ డ్రింకర్
అయితే, పొట్ట గట్టిగా పెరిగిందే.
అయితే దానిని ఒక మెడిసిన్ లా
చప్పరించండి అపుడు మంచి ఆరోగ్యం
కలిగిస్తుంది.
4. వోడ్కా
- రష్యా దేశ పానీయం వోడ్కా
కూడా ఆరోగ్యకరమైనది కాదు. అందులో 55 నుండి
60 కేలరీలు ఒక్క గుక్కలో చేరతాయి.
కనుక బరువు ఎక్కటం ఎంతో
తేలిక.
5. క్రీమీ
కాక్ టైల్స్ - క్రీము తేలియాడే కాక్ టెయిల్ అధిక
కొవ్వు కలిగిస్తుంది. ఈ రకంగా పైన
క్రీమ్ లేదా ఇతర ఆహారాలు
వేయబడే కాక్ టెయిల్స్ తాగకండి.
మీరు
నిజంగా బరువు తగ్గాలని భావించేవారైతే,
ఈ పానీయాలను తాగడం మానండి.
0 comments:
Post a Comment