వేసవి
వేడి మీలోని శక్తిని క్షీణింపచేసి అలసట కలిగేలా చేస్తుంది.
తరచుగా పోసే చెమట, దాహం
వంటివి రోజంతా మీకు చికాకు కలిగిస్తాయి.
రోజంతా శరీరంలో నీరు వుంటూ మీరు
ఉత్సాహంగా వుండాలంటే, ఆరోగ్యకరమైన పండ్ల రసాలు, కూల్
డ్రింక్ లు తాగాలి. ఇది
ఎందుకంటే, వేసవిలో వేడిని తట్టుకునేటందుకు వెంటనే మనం ఎక్కువ ద్రవాలు
తీసుకుంటాం. కాని ఎన్ని ద్రవాహారాలని
తీసుకుంటాం? కనుక దిగువ పేర్కొనే
కొన్ని ఆరోగ్యకర వేసవి ఆహారాలను కూడా
చేర్చి మీరు రోజంతా ఉత్సాహంగా
వుండవచ్చు. అదే సమయంలో శరీర
బరువు తగ్గిస్తూ శరీరంలోని మలినాలను కూడా తేలికగా బయటకు
పంపవచ్చు.
వేసవి
ప్రత్యేక ఆహారాలు
పుచ్చకాయ
- వేసవిలో చల్లగా వుండటానికిగాను పుచ్చకాయ, కర్బూజ పండ్లు బాగుంటాయి. వీటిలో నీరు అధికం కనుక
శరీరానికి కావలసినంత నీరు దొరుకుతుంది. మలబద్ధకం
ఏర్పడదు. వీటిలో వుండే సహజ షుగర్
డైటింగ్ చేసేవారికి, డయాబెటీస్ రోగులకు కూడా మంచిదే. రసాలుండే
ఈ పండ్లు ఎండవేడిమి రోజున మీ మూడ్
కూడా మార్చేస్తాయి.
మామిడిపండ్లు
- మామిడిపండ్లలో వుండే పీచు పదార్ధం
శరీర మలినాలను విసర్జిస్తుంది. ఈ కారణంగానే వేసవిలో
మామిడి పండ్లను ప్రతివారూ పోషకాహారంలో చేరుస్తారు. ఎండకు కమిలిపోవటం, ఎండలకు
మీ జుట్టు నష్టపోకుండా వుంటుంది. ఇందులో వుండే విటమిన్ ఎ
చర్మానికి కాంతినిస్తుంది. విటమిన్ సి ఎండ దెబ్బలనుండి
కాపాడుతుంది. అయితే, వీటిని అధికంగా తినకండి. ఎందుకంటే, వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుంటాయి.
బీట్
రూట్ - ఈ జాబితాలో బీట్
రూట్ లు మంచి ఆరోగ్యకర
ఆహారం. ఎర్రగా వుండే బీట్ రూట్
వేసవిలో తింటే శరీరం బాగా
శుభ్రమవుతుంది. ఇందులో విటమిన్ సి, బి3, బి6,
బేటా కెరోటిన్ లు మలినాలను విసర్జిస్తాయి.
బీట్ రూట్ శరీరంలో రక్తం
పెంచుతుంది కూడాను.
నిమ్మ
- దాహం వేసిందంటే, చల్లని నిమ్మరసం లేదా నిమ్మ సోడా
తాగేయటానికి చూస్తాం. నిమ్మలో విటమిన్ సి అధికం. శరీరానికి
తగిన తేమనిస్తుంది. చెడు వ్యర్ధాలను బయటకు
పంపుతుంది. కనుక దీనిని కూడా
మీ వేసవి ఆహారంలో చేర్చండి.
నిమ్మరసం ఉదయంవేళ తాగితే, పొట్ట శుభ్రం చేయటమే
కాక రోజంతా మీలోని ఎసిడిటీ లెవెల్స్ సమతుల్యత కాపాడుతుంది.
ఈ ఆహారాలు తినటం ద్వారా వేసవిలో
వేడిని అధిగమించండి.
0 comments:
Post a Comment