హైదరాబాద్:
వ్యభిచారం రాకెట్ కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరితో
తాను నాలుగైదు సార్లు మాట్లాడినట్లు రిటైర్డ్ ఐపియస్ అధికారి భాస్కర్ చెప్పారు. ఆయన తెలుగు టీవీ
చానెళ్లతో శనివారం మాట్లాడారు. తారా చౌదరితో తనకు
ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.
తన విజిటింగ్ కార్డు తారా చౌదరి నివాసంలో
దొరికినట్లు మీడియాలో వార్తలు రావడం వల్లనే తాను
ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నట్లు
ఆయన తెలిపారు.
తనకు
తారా చౌదరితో ఏ విధమైన సంబంధం
లేదని, తాను సేవా కార్యక్రమాలు
చేస్తున్నానంటే సహాయం చేయడానికి మాత్రమే
ప్రయత్నించానని ఆయన చెప్పారు. తనకు
ఇబ్బందులున్నాయంటూ ఓసారి చెప్పుకోవడానికి తారా
చౌదరి తన సహాయకుడిని తన
వద్దకు పంపిందని, సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే
ఆ సమయంలో తాను ఆ సమయంలో
తన విజిటింగ్ కార్డు ఇచ్చానని చెప్పారు. ఆ విజిటింగ్ కార్డును,
దరఖాస్తు ప్రతిని ఎవరికీ ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకుందని, దానివల్లనే ఇంట్లో తన విజిటింగ్ కార్డు
దొరికినట్లుందని ఆయన అన్నారు.
తారా
చౌదరితో తనకు సంబంధం లేదని,
ఆమె ఎవరో కూడా తెలియదని
ఆయన అన్నారు. గంటల తరబడి తారా
చౌదరితో తాను మాట్లాడినట్లు జరుగుతున్న
ప్రచారంలో నిజం లేదని ఆయన
అన్నారు. ఫోన్లో సుదీర్ఘంగా
మాట్లాడే అలవాటు కూడా తనకు లేదని
ఆయన అన్నారు. తన నుంచి తారా
చౌదరికి ముప్పు ఉందనే ఆరోపణలు అబద్ధమని
ఆయన అన్నారు. భాస్కర్ శుక్రవారం నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు పెట్టుకున్నారు.
పోలీసుల
విచారణను ఎదుర్కునే ఓపిక, శక్తి తనకు
లేవని, తనకు ఇప్పటికే గుండె
ఆపరేషన్లు జరిగాయని ఆయన తన బెయిల్
దరఖాస్తులో చెప్పారు. పోలీసు విచారణలో తారా చౌదరి పలు
విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసాఫీసరును తారా
చౌదరి బ్లాక్ మెయిల్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు
పలువురు పోలీసాఫీసర్లతోనూ సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తు
బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం
ద్వారా భాస్కర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
0 comments:
Post a Comment