తిరుపతి:
తన కుమారుడు గల్లా జయదేవ్కు
తిరుపతి శానససభా సీటు టికెట్ ఇప్పించుకోవడానికి
చేసే ప్రయత్నాల్లో వెనక్కి తగ్దేది లేదని మంత్రి గల్లా
అరుణ కుమారి అన్నారు. కడప జిల్లా ప్రజాపథం
కార్యక్రమానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
కలిసిన అనంతరం ఆమె శనివారం మీడియా
ప్రతినిధులతో మాట్లాడారు. యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి
తగ్దేది లేదని ఆమె అన్నారు.
తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికి చివరి దాకా ప్రయత్నాలు
సాగిస్తామని ఆమె చెప్పారు.
తిరుపతిలో
రేసులో తాము ఉన్నామని, తన
కుమారుడు గల్లా జయదేవ్ పోటీ
చేస్తాడని తాను ఇది వరకే
చెప్పానని, తన కుమారుడు కూడా
పోటీ చేస్తానని చెప్పాడని ఆమె అన్నారు. తన
కుమారుడికి తిరుపతి టికెట్ ఇస్తారని తాను కచ్చితంగా చెప్పడం
లేదని ఆమె అన్నారు. చిత్తూరు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సొంత జిల్లా అని, ఇక్కడి సీట్లకు
అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై
ముఖ్యమంత్రి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందని
ఆమె అన్నారు.
తిరుపతిలో
ఎవరు గెలుస్తారనుకుంటే ముఖ్యమంత్రి వారికి సీటు ఇస్తారని ఆమె
చెప్పారు. తాము మాత్రం తిరుపతి
టికెట్ కోసం వంద శాతం
ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె చెప్పారు. తాను
ఆ విషయం ముఖ్యమంత్రికి చెప్పినట్లు
ఆమె తెలిపారు. తమ ప్రయత్నాల ఫలితం
ఎలా ఉన్నప్పటికీ సానుకూలంగానే తీసుకుంటామని, తమ కుమారుడికి టికెట్
రాకపోయినా పార్టీ అభ్యర్థి కోసం కృషి చేస్తానని
ఆమె చెప్పారు.
రాజ్యసభకు
ఎన్నికైన మెగాస్టార్ చిరంజీవి శానససభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది. దీంతో
తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యంగా
మారింది. అయితే, చిరంజీవి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి పోటీ చేస్తారని,
చిరంజీవి చెప్పినవారికే ఆ సీటు ఇస్తారని
మొదట్లో ప్రచారం జరిగింది. ఆ వార్తలను చిరంజీవి
ఖండించారు. తన కుటుంబ సభ్యులెవరూ
పోటీ చేయబోరని ఆయన స్పష్టం చేశారు.
దీంతో గల్లా అరుణ కుమారి
తనయుడు గల్లా జయదేవ్ రంగం
మీదికి వచ్చారు.
0 comments:
Post a Comment