హైదరాబాద్:
దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి తన తనయుడు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
దోచిపెట్టాడని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మరోసారి ఆయన వైయస్ రాజశేఖర
రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్ అవినీతికి కారణం
వైయస్ రాజశేఖర రెడ్డేనని, వైయస్ జగన్ అవినీతికి
వైయస్ రాజశేఖర రెడ్డి సహకరించారని ఆయన శనివారం మీడియా
ప్రతినిధులతో అన్నారు.
వైయస్
జగన్ను దొంగ అంటూ
వైయస్ రాజశేఖర రెడ్డి పవిత్రుడని అంటే ప్రజలు నమ్మబోరని
ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
మనవాడని కాంగ్రెసు నాయకులు అంటే ప్రజలు నవ్వుతారని
ఆయన అన్నారు. వైయస్ చేసిన తప్పులను
ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన
అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
చేసిన తప్పులకు కాంగ్రెసు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు. ఈ
మేరకు పిసిసి, సిఎల్పీ సమావేశాల్లో తీర్మానం చేయాలని ఆయన అన్నారు.
కొందరు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
విమర్శిస్తుంటే, మరికొందరు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను విమర్శిస్తున్నారని,
ఇది సరి కాదని ఆయన
అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి
పాలన బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్
రాజశేఖర రెడ్డిపై కొందరు మంత్రులు బరి తెగించి మాట్లాడుతున్నారని,
వైయస్ రాజశేఖర రెడ్డి మనవాడని ఇంకా అంటే పార్టీకి
నష్టమని ఆయన అన్నారు.
పార్టీలో
క్రమశిక్షణ లేకుండా పోయిందని, క్రమశిక్షణ పాటించని నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీని
ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని, పార్టీ
పరిస్థితికి వైయస్ రాజశేఖర రెడ్డే
కారణమని ఆయన అన్నారు. వైయస్
ఉన్నప్పుడే తాను తాను తప్పులను
ఎత్తి చూపానని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డిపై వైయస్ జగన్ చెప్తున్న
మాటలు బూటకమని, వైయస్ పాలన తెస్తానని
జగన్ చెబుతున్నాడంటే దోపిడీ చేస్తానని చెప్పడమేనని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డిపై పాల్వాయి గోవర్దన్ రెడ్డి మొదటి నుంచీ విమర్శలు
చేస్తున్నారు.
0 comments:
Post a Comment