కాంగ్రెసు
సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డిలో
ఏ మాత్రం అయోమయం కనిపించదు. ఆయన తన దూకుడు
తగ్గించుకోరు. ప్రత్యర్థులపై చెణుకులు విసరడంలో, షార్ప్గా వ్యాఖ్యలు కట్
చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
ఆయన నుంచి ఎప్పుడు ఏ
విధమైన కొత్త వ్యాఖ్య వస్తుందో
చెప్పలేం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
అసలు రెడ్డి కారని ప్రచారం చేసి,
రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే
కాంగ్రెసు నాయకుల వ్యూహంపై ఆయన వ్యంగ్యాస్త్రమే విసిరినట్లు
ఉన్నారు.
ఆయన వ్యంగ్యం కూడా నిజమే అనిపిస్తోంది.
త్వరలో రెడ్డి పరివార్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ
నెల 20వ తేదీ తర్వాత
కాంగ్రెసు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం
ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. అందుకు
ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇప్పటికే
దానిపై కొంత మందితో సంప్రదింపులు
జరిపినట్లు ఆయన తెలిపారు. జగన్..
రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాడని నిరూపించడంతో పాటు,
ఆ సామాజిక వర్గం కాంగ్రెసులోనే కొనసాగేలా
చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.
తమ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం దూరమవుతోందనే కొంత
మంది నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.
ముఖ్యమంత్రి రెడ్డి అయి ఉండి కూడా
ఆ వర్గం పార్టీ దూరమవుతోందని
అనడాన్ని మాజీ మంత్రి జీవన్
రెడ్డి తప్పు పట్టారు. కిరణ్
కుమార్ రెడ్డి కనీసం రెడ్లను కూడా
ఆకర్షించకలేకపోతున్నారని
ఆయన అన్నారు. అది కిరణ్ కుమార్
రెడ్డికి చురక అనే విషయం
తెలిసిందే.
రెడ్డి
సామాజిక వర్గం వైయస్ జగన్
వైపు వెళ్తోందనే ఆందోళన కాంగ్రెసు పార్టీలో బలంగానే ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేయడంలోనే రెడ్లు దూరం కాకుండా చూసుకోవడానికనే
మాట వినిపించింది. రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రాంతానికి చెందిన
రెడ్డి మాత్రమే దీటుగా ఎదుర్కోగలడనే కారణంతోనే కిరణ్ కుమార్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేయడంలోని ప్రధాన కారణమంటారు.
0 comments:
Post a Comment