హైదరాబాద్:
పశువుల కంటికి అందరూ పశువుల్లాగే కనిపిస్తారని
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి
అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడిపై బొత్స సత్యనారాయణ చేసిన
వ్యాఖ్యలపై ఆమె సోమవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. బొత్స సత్యనారాయణ తీరును
రాష్ట్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆమె అన్నారు.
బలవంతంగా
ప్రజల గొంతులో బొత్స సత్యనారాయణ సారా
పోయిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి
కావాలనే అధికార దాహంతోనే బొత్స ఈ విధంగా
ప్రవర్తిస్తున్నారని నన్నపనేని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును గౌరవించడం
నేర్చుకోండని నన్నపనేని హితవు పలికారు. బొత్సను
కేబినేట్ నుంచి తొలగించాని ఆమె
డిమాండ్ చేశారు.
బొత్సను
అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద
నిరాహార దీక్ష చేస్తానని నన్నపనేని
రాజకుమారి తెలిపారు. విజయనగరం జిల్లా ఏమైన బొత్స జాగీరా
అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో చంద్రబాబును అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
మద్యం
సిండికేట్లకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు
చంద్రబాబు సోమవారం వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత
చోటు చేసుకుంది. బొత్స సత్యనారాయణను చంద్రబాబు
గంజాయి మొక్కగా అభివర్ణించారు. ప్రజల జీవితానికి బొత్స
సత్యనారాయణ మచ్చ తెచ్చారని ఆయన
విమర్శించారు. తాము దొంగలం కాదని
ఆయన అన్నారు. చెడు పేరు తెచ్చుకోవద్దని
ఆయన పోలీసులకు హితవు చెప్పారు.
0 comments:
Post a Comment