హైదరాబాద్:
విజయనగరం సంఘటనతో తమ పార్టీకి చెడ్డ
పేరు వచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెసు
సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావు అభిప్రాయపడ్డారు.
రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు
పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన సోమవారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వం పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయని
ఆయన అన్నారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నట్లుగా ముఖ్యమంత్రి
ప్రవర్తన ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మారిస్తేనే
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి రెండు, మూడు సీట్లు వస్తాయని
ఆయన అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నవారిని రూపుమాపేలా కిరణ్ కుమార్ రెడ్డి
వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో
పార్టీకి జీవం పోసేందుకు జాతీయ
నేత వాయలార్ రవి ఇచ్చిన నివేదికను
సోనియా గాంధీ అమలు చేయాలని
ఆయన కోరారు.
అవినీతి
నిరోధక శాఖ (ఎసిబి) నుచి
బదిలీ చేసిన అధికారి శ్రీనివాస
రెడ్డిని తిరిగి సిట్ ఇంచార్జీగా నియమించాలని
ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసే అధికారులకు గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. మద్యం
సిండికేట్లకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి
ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై శంకరరావు
చాలా కాలంగా ధ్వజమెత్తుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప
ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించి వారిద్దరు రాజీనామా చేయాలని ఆయన ఎప్పటికప్పుడు డిమాండ్
చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన మంత్రి పదవిని
కూడా కోల్పోవాల్సి వచ్చింది.
0 comments:
Post a Comment