రామ్
గోపాల్ వర్మ కాన్సెప్టు ను
తీసుకుని దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో డైలాగ్స్ రాయించి,శ్రీను వైట్ల డైరక్షన్ చేస్తే
ఎలా ఉంటుందో మా 'ఎన్.ఆర్.ఐ'చిత్రం అలా
ఉంటుంది అంటున్నారు డైరక్టర్ రఘు నందన్. రోహిత్,
మిథున జంటగా నటిస్తున్న చిత్రం
'ఎన్.ఆర్.ఐ'. 'నౌ
రిటర్న్ టు ఇండియా' అనే
ట్యాగ్ లైన్ తో వస్తున్న
ఈ చిత్రం గురించి ఇలా చెప్పుకుంటూ పబ్లిసిటీ
చేస్తున్నారు. ఎరీస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి రఘునందన్ గూడూర్ దర్శకుడు. హైదరాబాద్లో టైటిల్ లోగోని
దర్శకుల సంఘం అధ్యక్షులు వి.సాగర్ ఆవిష్కరించారు.
అలాగే
విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ
అవకాశాలకు కొదవలేదు అనే సందేశాన్ని అంతర్లీనంగా
చెప్పే చిత్రమిది. చక్కటి వినోదాన్ని కథలో మేళవించాం. సిడ్నీలో
కొంత భాగం తెరకెక్కించాం. మిగిలిన
చిత్రీకరణ హైదరాబాద్లో చేస్తాం. వచ్చే
నెలలో పాటల్ని, జూన్లో సినిమాని
విడుదల చేస్తామని''దర్శకుడు అన్నారు.
అలాగే
‘ఎన్ఆర్ఐ’ సినిమా బ్రోచర్ని మరో అతిథి
శివనాగేశ్వరరావు ఆవిష్కరించగా, సినిమా పోస్టర్లను ప్రసన్నకుమార్, కరుణాకరరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు
చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- ఇది కలర్ఫుల్
ఎంటర్టైనర్. యువతరానికి, కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. హేమ, శ్రీనివాసరెడ్డిని మినహాయిస్తే...
ఈ సినిమాకు పనిచేసిన వారందరూ దాదాపుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగువాళ్లే.
ఈ చిత్రం 60 శాతం సిడ్నీలో చిత్రీకరణ
పూర్తి చేశారు. మిగిలిన భాగం హైదరాబాద్లో
తీస్తారు. మే నెలలో పాటలను,
జూన్లో సినిమాను విడుదల
చేయాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శివనాగేశ్వరరావు,
టి.ప్రసన్నకుమార్, మిథున, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:
అనీష్రాజ్ దేశ్ముఖ్,
సహ నిర్మాతలు: శ్రీకాంత్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్.
0 comments:
Post a Comment