హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని తెలుగుదేశం పార్టీ
నేత వర్ల రామయ్య సోమవారం
విమర్శించారు. కిరణ్ కాంగ్రెసు పార్టీలో
ఉంటూనే జగన్ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని
ఆరోపించారు. ఆయన సోమవారం తెలుగుదేశం
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మాట్లాడారు.
స్పీకర్
పోస్టు ఇచ్చి తద్వారా ముఖ్యమంత్రి
కావడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఆయనకు సహకరించారని, అందుకు ఇప్పుడు కిరణ్ ఆయన తనయుడు
వైయస్ జగన్కు గురు
దక్షిణ చెల్లిస్తున్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ అక్రమాస్తులు, అవినీతి
ఆర్జనపై రాష్ట్రమంతా చర్చించుకొంటున్నా కిరణ్ మాత్రం ఏమీ
మాట్లాడటం లేదన్నారు.
శ్రీకాకుళం
జిల్లాలో నరసన్నపేటలో కిరణ్ వ్యాఖ్యలు చూస్తే
ఆయన వైయస్కు గురుదక్షిణగా
జగన్ను ఏమీ అనకుండా
ఉంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అంతేకాదు ఆయన మిగతా ఎవరినీ
జగన్ పైన విమర్శలు చేయనివ్వరని
ఆరోపించారు. ఎవరైనా ఆ సాహసం చేస్తే
గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారన్నారు.
ఈ కారణంగానే మాజీ మంత్రి శంకర
రావును మంత్రి వర్గం నుండి బర్తరఫ్
చేశారన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
శాఖలు కత్తిరించారన్నారు. భారతంలో శకుని పాత్రని కిరణ్
తలపిస్తున్నారని ఆరోపించారు.
0 comments:
Post a Comment