హైదరాబాద్:
అనంతపురం నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న
విషయం తెలిసిందే. బాబు అభ్యర్థుల ఖరారులో
బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఖరారు చేశారు. కడప
జిల్లా రాజంపేట నియోజకవర్గానికి పసుపులేటి బ్రహ్మయ్యను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
రాజంపేట
టిక్కెట్ కోసం పోటీలో ఉన్న
మరో నేత మదన్ మోహన్
రెడ్డి బాబుతో సమావేశానికి రాలేదు. దీంతో ఆయనతో మాట్లాడాక
తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో బాబు ఉన్నారు. ఇక
అనంతపురం విషయంలో మాత్రం బాబు సందిగ్ధంలో పడినట్లుగా
తెలుస్తోంది. అక్కడ మిత్ర పక్షానికి
అవకాశం ఇవ్వాలా లేక సొంతగా పోటీ
చేయాలా అనే విషయమై తేల్చుకోలేక
పోతున్నారు.
సీట్ల
సర్దుబాటులో భాగంగా అనంతపురం సీటును తమకు ఇవ్వాలని సిబిఐ
ఒత్తిడి తెస్తుండగా, ఇవ్వవద్దని స్థానిక నేతలు గట్టిగా పట్టుబడుతున్నారట.
ఈసారి ఉప ఎన్నికలు అన్ని
పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయని, ఈ సమయంలో గెలిచే
సీటును మిత్రపక్షానికి ఇవ్వవద్దని, ఆ పార్టీ అక్కడ
పోటీలో నిలవలేకపోతే పార్టీ నష్టపోతుందని, ఇటువంటి సమయంలో ఆ సీటును మిత్ర
పక్షానికి ఇవ్వవద్దని చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారట.
దీంతో,
చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని
అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని
ఖరారుకు సోమవారం జరిగిన సమావేశం వాయిదా పడింది. ఉప ఎన్నిక జరుగుతున్న
పోలవరం నియోజకవర్గంలో పర్యటనకు చంద్రబాబు బుధవారం అక్కడకు వెళుతున్నారు. పార్టీ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం
బుధవారం ఉదయం ఆయన పశ్చిమ
గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో పొగాకు రైతుల సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుంచి జీలుగుమిల్లి
మీదుగా టి.నర్సాపురం బహిరంగ
సభలో పాల్గొంటారు.
0 comments:
Post a Comment