హైదరాబాద్:
హీరో నందమూరి బాలకృష్ణ తీసుకునే నిర్ణయం తనకు ఎక్కడ నష్టం
చేకూరుస్తుందోనని భావించే కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఇటీవల అసంతృప్తికి
గురయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని నందమూరి వంశం
బ్రాండుతోనే రాజకీయాలలో ఎదిగాడు. ప్రధానంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా
ముద్రపడ్డాడు. ఈ కారణంగానే ఆయన
రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గుడివాడ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయితే
ఇటీవల ఆయన కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ కావొచ్చుననే ప్రచారం
జరిగింది. ఇటీవల విజయవాడలో జగన్తో కలిపి నాని
ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే మూడు రోజుల
క్రితం నాని తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడును
కలిసి ఆ ఫ్లెక్సీలకు తనకు
సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
తాను పార్టీని వీడాలని అనుకోవడం లేదని చెప్పారు.
అయితే
ఆయన తన అసంతృప్తిని ఇలా
మరో రకంగా బయట పెట్టారనే
వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన అసంతృప్తికి బాలకృష్ణ
తీసుకోబోయే నిర్ణయమే కావొచ్చునని అంటున్నారు. తాను రాజకీయాలలోకి వస్తానని
బాలయ్య ప్రకటించారు. 2014 ఎన్నికలలో బాలయ్య ఏదో ఒక నియోజకవర్గం
నుండి పోటీ చేసే అవకాశాలు
పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆ నియోజకవర్గం
గుడివాడ అవుతుందేమోననే ఆందోళన నానిని పట్టుకుందని అంటున్నారు.
తాను
పోటీ చేయదల్చుకున్న నియోజకవర్గం పేరును ఇప్పటి వరకు బాలయ్య ఖచ్చితంగా
చెప్పనప్పటికీ గుడివాడ నుండి పోటీ చేసేందుకు
ఆయన మొగ్గు చూపుతున్నారట! అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అధినేత చంద్రబాబు, బాలయ్యలపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో జూనియర్కు
కళ్లెం వేయాలంటే అతనికి అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న నాని నియోజకవర్గం నుండి
బాలయ్య పోటీ చేస్తే బాగుంటుందని
పలువురు భావిస్తున్నారట.
బాలయ్య
స్వయంగా ఈ సీటు కోరుకుంటే
వద్దనే వారుండరు. అలాంటి పరిస్థితి ఎదురైతే తన రాజకీయ మనుగడ
ప్రశ్నార్థకం అవుతుందని భావించిన కొడాలి నాని... జగన్ వైపుకు అంటూ
వ్యూహాత్మకంగా తన అసంతృప్తిని బయట
పెట్టారని అంటున్నారు. రెండు రోజుల క్రితం
బాబును కలిసిన నాని గుడివాడ సీటు
విషయంపై అడిగి ఉంటారని అంటున్నారు.
అయితే దీనిపై బాబు హామీ ఇచ్చారా
లేదా తెలియరాలేదంటున్నారు.
0 comments:
Post a Comment