కార్తీ, ప్రణీతలు
హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘శకుని'. ఎన్. శంకర్ దయాల్ దర్శకత్వంలో
రూపొందుతున్న ఈచిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ సంగీతం అందించారు. తెలుగులో ఈచిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ
సురేష్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదలైంది.
‘శకుని'
చిత్రం విడుదలైన ప్రతిచోట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కార్తీ
గత సినిమాల్లాగే నటనలో ఎనర్జీ చూపించాడు.
చిత్ర మొదటి భాగమంతా ఎంటర్టైన్
చేస్తూ రెండవ భాగంలో పొలిటికల్
గేమ్ ఆడుతూ అలరించాడు. పొలిటికల్
ఎంటర్టైనర్ గా తెరకెక్కిన శకుని
కార్తీ నటనతో గట్టెక్కింది. మొదటి
భాగం కామెడీతో సాగి రెండవ భాగం
పొలిటకల్ టర్న్ తీసుకుని ఆకట్టుకునే
ప్రయత్నం చేసింది. మొత్తానికి ‘శకుని' చిత్రం వన్ టైమ్ వాచ్
చిత్రంగా చెప్పొచ్చు.
ఇక ఈచిత్రంలో ఇతర విషయాలకొస్తే... శ్రీదేవి
పాత్రలో ప్రణీత చాలా వీక్. చిత్ర
ఈ సినిమాకి ఆమె ఏ మాత్రం
ఉపయోగపడింది లేదు. చాలా సన్నివేశాల్లో
లిప్ సింక్ కుదరలేదు, డబ్బింగ్
విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. ముఖ్యమంత్రి
ఆర్కే భూపతిగా ప్రకాష్ రాజ్ పర్ ఫెక్ట్
గా చేశాడు. ప్రతిపక్ష నాయకుడు వి.టి.ఎమ్.కె పార్టీ అధ్యక్షుడు
పెరుమాళ్ళు పాత్రలో కోట సహజంగా నటించాడు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రాధిక,
నాజర్, రోజా, సంతానం తదితరులు
తారాగణం. ఈ చిత్రానికి మాటలు:
శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య,
ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్:
ప్రేమ్రక్షిత్, బాబా భాస్కర్, సహ
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్,
ఎస్.ఆర్.ప్రభు, నిర్మాత:
కె.ఇ.జ్ఞానవేల్రాజా,
దర్శకత్వం: ఎన్.శంకర్ దయాళ్.
0 comments:
Post a Comment