నందమూరి నట సింహం బాలకృష్ణ కోసం 20 ఏళ్లైనా వెయిట్ చేస్తాను అంటున్నాడు ప్లాప్ డైరెక్టర్ జీవీ సుధాకర్ నాయుడు. "బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ దర్శకుడు తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మీడియాకు వివరించారు.
"త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టి అనిల్కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్ను నెలకొల్పిన జీవీ 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
ఇక బాలయ్య సుధాకర్ నాయుడితో సినిమా తీసే ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. బాలకృష్ణ తన తాజా చిత్రం అధినాయకుడు డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా సంతృప్తిగా ఉండటంతో హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం రవిచావలి దర్సకత్వంలో శ్రీమన్నారాయణ చిత్రం చేస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. విభిన్నంగా రూపొందుతున్న ఈచిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు.
అనగనగా ఒక ధీరుడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సూర్య ప్రకాశ్ ఆ చిత్రం ఘోర పరాజయంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణను డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. తన తొలి సినిమా ఫెయిల్యూర్ అయినా గ్రాఫిక్స్ లోనూ,హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాల్లోనూ ప్రకాష్ తన ప్రతిభను చూపించాడని,జానపద కథను బాగా తీసాడని అప్పట్లో వినిపించింది. దాంతో జానపద చిత్రం తరహా రీమేక్ కి ఈ యువ దర్శకుడుని అడిగినట్లు చెప్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు భట్టి విక్రమార్క.
0 comments:
Post a Comment