అనంతపురం/
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఓదార్పు యాత్రపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మనుగడపై వైయస్ రాజశేఖర రెడ్డి
పాత్రపై మంత్రి టిజి వెంకటేష్ తీవ్ర
వ్యాఖ్యలు చేశారు. మేళతాళాలతో ఓదార్పు యాత్ర చేయవద్దని తమ
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం తప్పా
అని లడపాటి రాజగోపాల్ ప్రశ్నించారు.
అనంతపురం
జిల్లా రాయదుర్గంలో ఆయన శనివారం ప్రజాహిత
పాదయాత్ర నిర్వహించారు. చావుకు, పెళ్లికి తేడా తెలియకుండా వైయస్
జగన్ ఓదార్పు యాత్ర చేశారని ఆయన
వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసును
18 స్థానాల్లో గెలిపిస్తే సమైక్యాంధ్ర కోసం కేంద్రంతో ప్రకటన
చేయిస్తామని, ఆగస్టులో కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని
ఆయన చెప్పారు. సమైక్యాంధ్రకు శానససభలో తీర్మానం కూడా చేయిస్తామని ఆయన
చెప్పారు.
సంక్షేమ
పథకాల అమలుపై, అభివృద్ధిపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తాము తిప్పికొట్టగలిగామని ఆయన చెప్పారు.
కాంగ్రెసు సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే కాంగ్రెసు విజయం ఖాయమని ఆయన
అన్నారు. పత్తిపాడులో ప్రారంభమైన లగడపాటి రాజగోపాల్ ప్రజాహిత పాదయాత్ర శనివారం సాయంత్రం రాయదుర్గంలో ముగుస్తుంది. ఓ వైపు వైయస్
రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చెబుతూ మరో వైపు వైయస్
కోరుకున్న సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్, విజయమ్మ మాట్లాడడం
వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస)ని పెంచి
పోషించింది వైయస్ రాజశేఖర రెడ్డి
మాత్రమేనని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.
ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే రాష్ట్రం విడిపోతుందని ఆయన కర్నూలు జిల్లాలో
అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాస, తెలుగుదేశం కుటుంబ పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ
ప్రయోజనం కోసమే వైయస్ రాజశేఖర
రెడ్డి కుటుంబం కాంగ్రెసుపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment