కమల్
హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం' వచ్చే నెలలో ప్రేక్షకుల
ముందుకురానుంది. కమల్హాసన్ స్వీయ
దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న
విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల భారీ వ్యయంతో
అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం
తెరకెక్కుతోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం
పనిచేస్తున్నారు.
తాజాగా
విడుదలైన ఈ చిత్రం థియేటర్
ట్రైలర్...కమల్ హాసన్ నటించిన
సూపర్ హిట్ చిత్రం ‘సాగర
సంగమం'చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఆ చిత్రంలో మాదిర
కమల్ ఇందులో క్లాసికల్ డాన్స్తో చేశారు. చాలా
రోజుల తర్వాత కమల్ నాట్యం చూడటంతో
అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి.
సినిమా
కథ విషయానికొస్తే...న్యూజెర్సీలో నివసించే హీరో విశ్వనాథ్ ఓ
నాట్యకారుడు. పెళ్లిచేసుకొని ఆనందకరమై వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. అంతలోనే అతని భార్య అతని
నుంచి విడాకులు కోరుకుంటుంది. విడాకుల కోసం ఆమెకు సరైన
కారణాలు దొరకవు. దీంతో భర్తలో ఏదో
ఒక తప్పును తెలుసుకోవాలనుకుంటుంది. అందుకు ఓ డిటెక్టివ్ను
నియమిస్తుంది. ఆ తర్వాత ఏం
జరిగిందనేదే చిత్ర కథాంశం.
టెర్రరిజం
నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది.
అధిక భాగాన్ని అమెరికాలో చిత్రీకరించారు. ఇటీవల సింగపూర్లో
జరిగిన చిత్రోత్సవంలో కమల్హాసన్ ఈ
సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ ట్రైలర్స్ను విడుదల చేశారు.
పూజా కుమార్, రాహుల్బోస్, ఆండ్రియా జర్మయ్,
జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్ని పోషించారు. శంకర్-ఎహసాన్-లాయ్
సంగీతాన్నందించారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక
బడ్జెట్తో ‘విశ్వరూపం' రూపొందుతోంది.
మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
0 comments:
Post a Comment