ఓ పదేళ్ళ క్రితం ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, అక్కినేని కుమారుడు నాగార్జున కలిసి గుండమ్మ కథ
ను రీమేక్ చేద్దామనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు.
ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. గుండమ్మ కథ టాపిక్ వచ్చినప్పుడల్లా
ఈ రీమేక్ విషయం తెర మీదకు
వస్తోంది. 1962 జూన్ 7న విడుదలైన
‘గుండమ్మ కథ' యాభై సంవత్సరాలు
పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా అక్కినేని ని కలిసింది.
‘గుండమ్మ
కథ'రీమేక్ విషయమై అక్కినేని మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో నాగార్జున,బాలకృష్ణ ఆ రీమేక్ చేద్దామని
ట్రై చేయటం మాత్రం నిజం.
కానీ గుండమ్మ చేసే వారు దొరకక
ఆగిపోయారు. దాంతో ఆ ఆలోచన
విరమించుకున్నాం. ఇప్పుడు వాళ్లు యాభైల్లో పడ్డారు. ఇప్పుడు చేయటం కష్టం. యంగ్
జనరేషన్ హీరోలు జూ.ఎన్టీఆర్,నాగచైతన్య
ఆ రోల్స్ కి బెస్ట్ అని
తేల్చి చెప్పారు.
ఇక ‘గుండమ్మ కథ' విషయానికి వస్తే...భారతదేశంలో వంద సినిమాలు పూర్తి
చేసిన తొలి హీరోగా ఈ
చిత్రంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆ తరువాతి స్థానం
అక్కినేనిదే. ఆయనకు ఇది 99వ
సినిమా. వీరిద్దరూ కలిసి నటించిన పదో
సినిమా ఇది. తెలుగుతో పాటు
తమిళంలో కూడా ఈ సినిమా
తయారైంది. అక్కడ చక్రపాణి డెరైక్ట్
చేశారు. ఎన్టీఆర్ పాత్రను జెమినీ గణేశన్ పోషించగా, ఏయన్నార్, సావిత్రి, జమున తమ పాత్రలు
తామే చేశారు.
జానపద
బ్రహ్మగా ప్రసిద్ధి పొందిన విఠలాచార్య కన్నడంలో తీసిన 'మనే తుంబిద హెణ్ణు'
అని సినిమాకి ఇది రీమేక్. ఆ
చిత్ర కథ బాగా నచ్చడంతో
తన సోదరుడు బి.ఎన్.రెడ్డి
దర్శకత్వంలో నిర్మించాలని నాగిరెడ్డి నిర్ణయించుకుని డి.వి.నరసరాజుతో
కూర్చుని స్క్రిప్ట్ తయారు చేయించి కమలాకర
కామేశ్వరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించి
ఘన విజయం సాధించారు. ఇప్పుడీ
చిత్రాన్ని రీమేక్ చెయ్యాలన్నా గుండమ్మ పాత్రతో పాటు ఇద్దరు హీరోలు
డీల్ చేసి హిట్టు కొట్టగల
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు కూడా అవసరం.
0 comments:
Post a Comment