హైదరాబాద్:
కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ గనుల తవ్వకాల
కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి
ప్రాసిక్యూషన్కు ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి అనుమతించారు. ఆయన గురువారం ఈ
మేరకు అనుమతి ఇచ్చారు. శ్రీలక్ష్మిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినట్లు
సమాచారం. శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ
సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది.
శ్రీలక్ష్మి
ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో
ఉన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్
కోడ్, అవినీతి నిరోధక చట్టం కింద ఆమె
విచారణకు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి
సంతకం చేసారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఐఎఎస్ అధికారి బిపి
ఆచార్య విచారణకు ఇప్పటికే ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇవో)గా ఉన్న
మరో ఐఎఎస్ అధికారి ఎల్వీ
సుబ్రహ్మణ్యం విచారణకు మాత్రం ముఖ్యమంత్రి నిరాకరించారు.
అసాధారణ
వేగంతో 2007 జూన్ 18న ఓఎంసీకి మైనింగ్
లీజులు కేటాయిస్తూ 151, 152 జీవోల జారీ వెనక
శ్రీలక్ష్మి నుంచి ఉన్న ఒత్తిడి,
ఆదేశాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఓ జీవోలో కాప్టివ్
మైనింగ్ అనే పదాన్ని తొలగించి,
గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మేలు చేసేలా శ్రీలక్ష్మి
జీవో జారీ చేశారని ఆరోపణలున్నాయి.
అయితే, అందుకు అప్పటి గనుల శాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డిపై శ్రీలక్ష్మి నిందలు వేస్తున్నారు.
ఓబుళాపురం
మైనింగ్ కేసులో హడావుడిగా ఒకే రోజు జివోలు
జారీ చేయడంలో తాను చేసింది తప్పయితే
అదే రోజు సంతకం చేసిన
అప్పటి గనుల శాఖ మంత్రి
సబితా ఇంద్రా రెడ్డిదీ తప్పేనని శ్రీలక్ష్మీ అన్నారు. సిబిఐ దృష్టిలో మంత్రి
చేస్తే తప్పు కాదా అని,
తాను చేస్తేనే తప్పువుతుందంటున్నారని తెలిపింది. సంతకం చేసే ముందు
మంత్రికి ఏవైనా అనుమానాలుంటే వివరణ
ఇవ్వడానికి సిబ్బంది ఉన్నారని, అయితే ఆమె అలాంటిదేమీ
చేయలేదని చెప్పారు. కేబినెట్ ఆమోదించాకే జివోలు జారీ అయ్యాయని, కాని
ఎవరికీ అనుకూలంగా వారు వాంగ్మూలాలు ఇచ్చారని
అన్నారు.
0 comments:
Post a Comment