హైదరాబాద్:
ఆధునిక సమాచార వినిమయ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు రాయడమనేది దాదాపుగా మరిచిపోయినట్లే అయింది. కానీ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు.
ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ఆధునిక మీడియా అందుబాటులో లేదు. మీడియాతో మాట్లాడడానికి
అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన
పిటిషన్ ఈ నెల 21వ
తేదీకి వాయిదా పడింది.
ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లకు విజ్ఞప్తి చేయడానికి ఆధునిక సౌకర్యాలు ఆయనకు అందుబాటులోకి వచ్చే
అవకాశం లేదు. ఈ నెల
12వ తేదీన 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ఆయన
పోస్టు కార్డులను వినియోగించుకునే వీలుంది.
జైలు
మాన్యువల్ ప్రకారం - ఖైదీ పక్షం రోజుల్లో
ప్రభుత్వం ఖర్చుతో ఓ పోస్టు కార్డు
వాడుకోవచ్చు. అండర్ టర్యల్ ఖైదీ
ఆ పోస్టు కార్డును తన కుటుంబ సభ్యులకు,
బంధువులకు లేదా మిత్రులకు ఉత్తరం
రాయడానికి పోస్టు కార్డును వాడుకోవచ్చు. అయితే, పోస్టు కార్డులోని విషయాన్ని జైలు అధికారులు సెన్సార్
చేస్తారు. అభ్యంతరకరమైన విషయాలు లేకుండా చూస్తారు.
ఈ స్థితిలో వైయస్ జగన్ పోస్టు
కార్డును వాడుకుని ఓటర్లకు ఏదో రూపంలో విజ్ఞప్తి
చేసుకునే అవకాశాలున్నాయి. అయితే వైయస్ జగన్మోహన్
రెడ్డికి ఉత్తరం రాయవచ్చుననే ఐడియా వస్తుందా, ఆయనకు
ఈ ఐడియాను ఎవరైనా అందజేస్తారా అనేది చూడాల్సిన విషయం.
పోస్టు కార్డు ధర యాభై పైసలు
మాత్రమే. దాని ఖర్చును కూడా
ప్రభుత్వం భరిస్తుంది.
0 comments:
Post a Comment