
పొడవాటి
వీల్‌బేస్, ఆకర్షనీయమైన డిజైన్,
సౌకర్యవంతమైన మరియు విశాలవంతమైన క్యాబిన్,
పవర్‌ఫుల్ ఇంజన్, ఎక్సలెంట్
మైలేజ్ వంటి ఫీచర్లతో ఆల్ఫా
ప్లస్ 3వీలర్ లోడ్ క్యారియర్‌ను కంపెనీ తీర్చిదిద్దింది.
పొడవైన డెక్ (వెనుక ట్రక్కు)
కారణంగా ఇది అధనంగా 20 శాతం
అధిక లోడ్‌ను ఆఫర్
చేస్తుంది. 'పెద్ద ఆదాయం కోసం
పెద్ద ఆల్ఫా' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన కొత్త
ఆల్ఫా నిజంగానే తన కస్టమర్లకు మంచి
ఆదాయాలను చేకూర్చి పెడుతుంది.
మహీంద్రా
ఆల్ఫా ప్లస్ క్యాబిన్ దూర
ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉండేలా
డిజైన్ చేశారు. ఇది సాధారణ ఆల్ఫాతో
పోలిస్తే ఇది మరింత పొడవుగా
వుంటుందని, నగర రోడ్లపై మరింత
అధిక పేలోడ్‌తో వెళ్లేందుకు అనువుంగా
ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా సీనియర్
వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్) వివేక్ నాయర్ తెలిపారు. దీని గేర్ బాక్స్
జీవితకాలంలో 20 శాతం, ఇంజన్ టార్క్‌లో 8 శాతం అధిక
పనితీరును కనబరుస్తుందని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment