హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
అస్తుల కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను సినీ హీరో
నాగార్జున కలుసుకున్నారు. ఆయన శనివారం ములాఖత్
సమయంలో నిమ్మగడ్డను కలిశారు. ఈ భేటీపై సర్వత్రా
ఆసక్తి చోటు చేసుకుంది.
నిమ్మగడ్డ
ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రముఖ
సినీ నటుడు నాగార్జున పెట్టుబడులు
పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వాన్‌పిక్ ప్రాజెక్టును
చేపట్టిన మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్
ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆయన భారీగా
పెట్టుబడి పెట్టినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల
దినపత్రిక రాసింది. వైయస్ జగన్ ఆస్తుల
కేసులో సిబిఐ వాన్‌పిక్
ప్రాజెక్టుపై దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ ఆంగ్ల దినపత్రిక కథనం
ప్రకారం - మాట్రిక్స్ 2010 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన
మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్
కంపెనీ ఎజిఎం జరిగింది. ఈ
సందర్భంగా కంపెనీ వార్షిక ఆదాయవ్యయాలను రిజిస్ట్రార్ కంపెనీలకు సమర్పించంది. ఇందులో అక్కినేని నాగార్జున పేరు ఉంది. ఇందులో
నాగార్జున పది రూపాయల ముఖ
విలువ కలిగిన 2 లక్షల వాటాలను కలిగి
ఉన్నట్లు తెలిపారు.
నిమ్మగడ్డ
ప్రసాద్ అరెస్టయిన తర్వాత తన వాటాలను వెనక్కి
తీసుకోవడానికి నాగార్జున ప్రయత్నించినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక
రాసింది. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది.
ఇందులో 30 శాతం వాటాను సోనీ
పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది.
మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.
0 comments:
Post a Comment